TVK Party: తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధ్యక్షుడు, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమికే ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలకు నటుడు విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇవ్వటంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్ రాజకీయ ప్రవేశం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాదు.. ఆయన రాజకీయ ప్రవేశం ఇండియా కూటమి విజయానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లను, ముఖ్యంగా ప్రతిపక్ష ఓట్లను విజయ్ పార్టీ చీల్చుతుందని టీఎన్‌సీసీ చీఫ్ సెల్వపెరుంతగై వెల్లడించారు.
Read Also: Zelensky: రష్యాపై క్షిపణులతో దాడి చేస్తా.. పర్మిషన్ ఇవ్వండి
కాగా, దళపతి విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇండియా కూటమి మిత్రపక్షలు ఎలాంటి అలజడికి గురికాలేదని సెల్వపెరుంతగై పేర్కొన్నారు. దేశంలో ఇండియా కూటమి బలంగానే ఉంది.. కాంగ్రెస్ 2004- 2014 మధ్య కేంద్రంలో అధికారాన్ని షేర్ చేసుకుంది.. దాని ఆధారంగా.. మేం అధికారం పంచుకునే ఆలోచనతో అంగీకరిస్తున్నామన్నారు. అయితే, అధికారాన్ని పంచుకోవడంపై జాతీయ నాయకత్వందే తుది నిర్ణయం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి సాధారణ మెజారిటీ వచ్చే అవకాశం లేదు.. కాబట్టి కాంగ్రెస్ మద్దతుతో మాత్రమే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉందని టీఎన్‌సీసీ చీఫ్ సెల్వపెరుంతగై తెలిపారు.
Read Also: Ponnam Prabhakar: దేశం మొత్తానికి సమగ్ర సర్వే దిక్సూచి.. నవంబర్ 6 నుండి ప్రారంభం..
సోనియా గాంధీ నేతృత్వంలో తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా సపోర్టు ఇచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ తెలిపారు. అధికారంలో వాటా కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి ఉంటే అప్పటి సీఎం కరుణానిధి ఇచ్చి ఉండేవారని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ అధికారంలో వాటా తీసుకోలేదు.. అధికార భాగస్వామ్యం ప్రజల ఆదేశంపై ఆధారపడి ఉంటుందని సెల్వపెరుంతగై వెల్లడించారు. ప్రతి రాజకీయ పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని అనుకుంటుంది.. మేం తమిళనాడులో కామరాజ్ పాలనను ప్రారంభిస్తామని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై చెప్పుకొచ్చారు.