NTV Telugu Site icon

Periyar: తమిళనాడులో ఎవరూ చేయలేని పని ‘‘విజయ్’’ చేశాడు..

New Project

New Project

Periyar: తమిళనాట యాక్టర్ విజయ్ పార్టీ ‘‘తమిళగ వెట్రి కజగం(టీవీకే)’’ సంచలనంగా మారింది. ఆదివారం విల్లుపురం వేదికగా జరిగిన తొలి సభకే దాదాపుగా 8 లక్షల మంది హాజరు కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్న్నికలే టార్గెట్‌గా విజయ్ పావులు కదుపుతున్నాడు. ఈ సభలో అధికార డీఎంకే పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకే కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని చెప్పారు. ఇదే విధంగా మతతత్వ రాజకీయాలు చేసే పార్టీలకు తాము వ్యతిరేకమని పరోక్షంగా బీజేపీ పేరు తీసుకువచ్చారు.

ఇదిలా ఉంటే, తమిళనాడులో రాజకీయాలు ముఖ్యంగా ద్రవిడవాదం, పెరియార్ సిద్ధాంతాల ఆధారంగా నడుస్తాయి. అయితే, విజయ్ మాత్రం పెరియార్ సిద్ధాంతాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రావిడ ఐకాన్‌గా భావించే పెరియార్ ‘‘దేవుళ్లను తిరస్కరించే సిద్ధాంతం’’ని తాము తీసుకోవడం లేదని, కానీ ఆయన చెప్పిన సామాజిక న్యాయం, మహిళా సాధికారత అనే పెరియార్ చెప్పిన అంశాలను మాత్రం తీసుకుంటామని చెప్పారు. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై చెప్పినట్లు ‘‘అందరూ ఒక్కరే, ఒక్కడే దేవుడు’’ అనేదే తమ భావజాలమని ప్రకటించాడు.

Read Also: NBK 109: సారీ.. పండక్కి అప్‌డేట్‌ ఇవ్వలేకపోతున్నాం: నాగవంశీ

ఇలా పెరియార్ వైఖరి నుంచి విజయ్ తప్పుకోవడం సంచలనంగా మారింది. సాధారణంగా తమిళనాడు రాజకీయాలు అన్ని పెరియార్ చుట్టూ తిరుగుతుంటాయి. అలాంటిది ఆయన సిద్ధాంతాలకు విజయ్ దూరంగా ఉండటం ప్రధాన చర్చగా మారింది. పెరియార్ అతడి రాజకీయాలే తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకేలకు పునాది. జస్టిస్ పార్టీ అధినేత పెరియార్ 1944లో దాని పేరును ద్రవిడర్ కజగంగా మార్చారు.1949లో అన్నాదురై పార్టీని విభజించి డీఎంకేను స్థాపించారు. ఆ తర్వాత 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి ఏఐఏడీఎంకేను స్థాపించారు.

ప్రముఖ దేశాలయాలు ఉన్న తమిళనాడు రాష్ట్రంలో మతపరమైన భావాలు పుంజుకుంటున్న తరుణంలో విజయ్ రాజకీయ అరంగ్రేటం జరిగింది. తమిళనాడులో మాజీ ఐఏఎస్ అన్నామలై ఆధ్వర్యంలో బీజేపీ అక్కడ జాతీయవాదాన్ని, హిందుత్వాన్ని తట్టిలేపుతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీ సీట్లు గెలవకున్నా, ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోగలిగింది. నిజానికి జోసెఫ్ విజయ్ క్రిష్టియన్, కానీ ఆ మతాన్ని పెద్దగా ఆచరించడం లేదు. ఆయన తల్లి, భార్య హిందూ ముదలియర్‌లు. ఈ సమీకరణం విజయ్‌కి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. దీనికి తోడు ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ కూడా ఇందుకు ఓ కారణం.

డిప్యూటీసీఎం ఉదయనిధి స్టాలిన్ సనాతనాన్ని తుడిచిపెట్టాలి అని చేసిన వ్యాక్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అక్కడి హిందువుల్లో కూడా కాస్త వ్యతిరేఖత ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ మతాల విషయంలో న్యూట్రల్‌గా ఉంటడం కలిసి రావచ్చు. గతంలో ఉన్నంత బలంగా ఏఐడీఎంకే లేదు. బీజేపీ అన్నామలై నేతృత్వంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రాజకీయ శూన్యత అనేది విజయ్‌కి కలిసి రావచ్చు.