దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. దశాబ్దకాలంగా ఈ కేసు నడుస్తోంది. ఈ కేసులో తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా నిందితులుగా ఉన్నారు. తాజాగా ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇంద్రాణి ముఖర్జియా మరో కుమార్తె విధి ముఖర్జియా సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని తేల్చి చెప్పింది. సీబీఐ చార్జిషీట్లో ఉన్న వాంగ్మూలం నకిలీని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కోర్టులో ఖండించారు.
ఇది కూడా చదవండి: Trump: ఆ ముగ్గురూ కలిసి అమెరికాపై కుట్ర.. చైనా కవాతుపై ట్రంప్ ఆరోపణలు
ఇంద్రాణి ముఖర్జియా మరో కుమార్తె విధి ముఖర్జియా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించింది. ఈ కేసును వాదించుకోవడానికి తన తల్లి దగ్గర ఎలాంటి నిధులు లేవని.. ఆమెకు సంబంధించిన ఆభరణాలు, రూ.7 కోట్ల నగదును మీడియా అధినేత పీటర్ ముఖర్జియా కుమారులు రాహుల్, రాబిన్ దొంగిలించారని ఆరోపించింది. కుట్రపూరితంగా ఇంద్రాణిని ఈ కేసులో ఇరికించారని వాపోయింది. ఇంద్రాణిని అరెస్ట్ చేసినప్పుడు తాను మైనర్ అని చెప్పింది. ఈ దుర్ఘటన నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నట్లు వెల్లడించింది. కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసుల ఎదుట హాజరయ్యానని.. అలాగే సీబీఐ అడిగిన ప్రశ్నలకకు కూడా సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అయితే సీబీఐ బయట పెట్టిన వాంగ్మూలాలతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. విచారణ సమయంలో తనతో బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపించింది. ఇంద్రాణి, సంజీవ్‌ను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని వాపోయింది.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నడిరోడ్డుపై కళాకారులతో తేజస్వి యాదవ్ డ్యాన్స్.. వీడియో వైరల్
2012లో షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్రాయ్, సంజీవ్ ఖన్నాలు హత్య చేసినట్లు కేసు నమోదైంది. 2015లో ఓ ఆయుధాల కేసులో శ్యామ్ అరెస్టు కాగా షీనా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఇంద్రాణి, సంజీవ్, పీటర్లను అరెస్టు చేశారు. ఈ హత్య తర్వాత షీనా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె మెయిల్ నుంచి ఇంద్రాణి సందేశాలు పంపించినట్లు విచారణలో తేలింది.