గుజరాత్ ఆస్పత్రికి సంబంధించిన ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో మహిళలకు సంబంధించిన విషయాలు చాలా రహస్యంగా ఉంటాయి. ట్రీట్‌మెంట్ గానీ.. పరీక్షలు గానీ అత్యంత గోప్యంగా నిర్వహిస్తారు. అలాంటిది రాజ్‌కోట్‌లోని పాయల్ ప్రసూతి వార్డుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మహిళా రోగులకు నర్సింగ్ సిబ్బంది ఇంజెక్షన్లు ఇస్తున్న సీసీటీవీ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. దీంతో మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సీరియస్ అయింది. వీడియోలు ఆన్‌లైన్‌లోకి రావడంపై దర్యాప్తునకు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Guntur Crime News: రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగి అక్రమ సంబంధాల వ్యవహారం!
అయితే వీడియోలు ఆన్‌లైన్‌లోకి రావడంపై రాజ్‌కోట్ ఆసుపత్రి డైరెక్టర్ స్పందించారు.. సీసీటీవీ సర్వర్ హ్యాక్ అయిందని.. అందువల్లే ఆస్పత్రి దృశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘ఆసుపత్రి వీడియోలు ఎలా వైరల్ అయ్యాయో నాకు తెలియదు. మా సీసీటీవీ సర్వర్ హ్యాక్ అయినట్లు కనిపిస్తోంది. అయితే ఇది ఎందుకు జరిగిందో మాకు కూడా తెలియదు. పోలీసులకు తెలియజేస్తాము. మేము ఫిర్యాదు కూడా చేశాం. దర్యాప్తులో పోలీసులతో సహకరిస్తాము.’’ అని ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ అమిత్ అక్బరి అన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి.. మరింత పైపైకి బంగారం ధరలు
ఆన్‌లైన్ దృశ్యాలు అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యులతో సహా మొత్తం ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. ‘‘వీడియోలలోని కంటెంట్‌పై దర్యాప్తు జరుగుతోంది. ఈ వీడియోలను ఎవరు తీశారు, ఏ ఉద్దేశ్యంతో తీశారు అనే దానిపై మేము దర్యాప్తు చేస్తున్నాము. సైబర్ క్రైమ్ ఐటీ చట్టంలోని 66E, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తాము.’’ అని పోలీసులు తెలిపారు.