Site icon NTV Telugu

Viral Video: మహిళను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసలి.. ఒడిశా వీడియో వైరల్..

Odisha Incident

Odisha Incident

Viral Video: ఒడిశాలో భయానక ఘటన చోటుచేసుకుంది. జాజ్‌పూర్ జిల్లాలో ఓ మహిళను మొసలి నదిలోకి ఈడ్చుకెళ్తున్న సంఘటన స్థానికంగా ప్రజల్లో భయాందోళల్ని నింపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధిత మహిళను 57 ఏళ్ల సౌదామిని మహాలగా గుర్తించారు. బింఝార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంతియా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం స్నానం కోసం వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. మహాల స్నానం చేస్తుండగా, నదిలో ఉన్న మొసలి ఆమె దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: CJI BR Gavai: సోషల్ మీడియాలో ఏం అవుతుందో: ‘‘మహావిష్ణువు’’ వివాదం మధ్య సీజేఐ కీలక వ్యాఖ్యలు..

ఒక మొసలి మహిళను నదిలోకి ఈడ్చుకెళ్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళ చేయిని మొసలి నోట కరుచుకుని వెళ్తోన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మహిళ ఖరస్రోత నదిలో స్నానం చేస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. నది ఒడ్డున ఉన్న గ్రామస్తులు ఆమెను రక్షించేందుకు మొసలిని వెంబడించారు. కానీ ఆమెను రక్షించడంలో విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version