NTV Telugu Site icon

West Bengal: బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్లదాడి.. పరుగులు తీసిన భద్రతా సిబ్బంది, మీడియా..

West Bengal

West Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. ఝర్‌గ్రామ్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్ల దాడి జరిగింది. ఆరో దశ పోలింగ్‌లో భాగంగా మిడ్నాపూర్ జిల్లాలోని గర్బెటాలోని మంగళపోత ప్రాంతాన్ని సందర్శిస్తున్న సమయంలో బీజేపీ నేత ప్రనత్ తుడు‌పై దాడి జరిగింది. పెద్ద ఎత్తున రాళ్లదాడి జరగడంతో భద్రతా సిబ్బంది అతనికి రక్షణ కల్పించింది. ఈ దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రనత్ తుడతో పాటు అతని భద్రతా సిబ్బంది, మీడియా పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు వ్యక్తులు బీజేపీ అభ్యర్థిని వెంబడించడం విజువల్స్‌లో చూడొచ్చు.

Read Also: MS Dhoni: ఎకానమీ క్లాస్‍లో ప్రయాణం చేసిన ధోనీ.. చప్పట్లు, కేరింతలతో మార్మోగిన విమానం..

ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గుండాలు కారణమని తుడు ఆరోపించారు. ఇద్దరు భద్రతా సిబ్బంది తలకు గాయమై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని అన్నారు. ఎంపీ అభ్యర్థి భద్రతా సిబ్బంది ఓటేసేందుకు క్యూలో నిలబడిన మహిళపై దాడి చేయడంతోనే నిరసనకు దారి తీసిందని అధికార టీఎంసీ ఆరోపించింది. ఈ ఘటనపై బీజేపీ బెంగాల్ కో ఇంచార్జ్ అమిత్ మాల్వీయా ఎక్స్ వేదికగా టీఎంసీని నిందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించేందుకు ఓటు వేస్తు్న్నారని ట్వీట్ చేశారు. పార్టీ ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదన్న రిపోర్టులు రావడంతో గార్పేటలోని కొన్ని పోలింగ్ బూతులకు వెళ్లినట్లు ప్రనత్ తుడు చెప్పారు. అకాస్మాత్తుగా టీఎంగీ గుండాలు నా కారుపై ఇటుకలతో దాడి చేశారని, నా భద్రతా సిబ్బంది గాయపడ్డారని, ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్ల తలకు గాయాలు అయ్యాయని చెప్పారు.

Show comments