West Bengal: బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్లదాడి.. పరుగులు తీసిన భద్రతా సిబ్బంది, మీడియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. ఝర్‌గ్రామ్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్ల దాడి జరిగింది. ఆరో దశ పోలింగ్‌లో భాగంగా మిడ్నాపూర్ జిల్లాలోని గర్బెటాలోని మంగళపోత ప్రాంతాన్ని సందర్శిస్తున్న సమయంలో బీజేపీ నేత ప్రనత్ తుడుపై దాడి జరిగింది. పెద్ద ఎత్తున రాళ్లదాడి జరగడంతో భద్రతా సిబ్బంది అతనికి రక్షణ కల్పించింది. ఈ దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రనత్ తుడతో పాటు అతని భద్రతా సిబ్బంది, మీడియా పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు వ్యక్తులు బీజేపీ అభ్యర్థిని వెంబడించడం విజువల్స్‌లో చూడొచ్చు.
Read Also: MS Dhoni: ఎకానమీ క్లాస్‍లో ప్రయాణం చేసిన ధోనీ.. చప్పట్లు, కేరింతలతో మార్మోగిన విమానం..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గుండాలు కారణమని తుడు ఆరోపించారు. ఇద్దరు భద్రతా సిబ్బంది తలకు గాయమై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందని అన్నారు. ఎంపీ అభ్యర్థి భద్రతా సిబ్బంది ఓటేసేందుకు క్యూలో నిలబడిన మహిళపై దాడి చేయడంతోనే నిరసనకు దారి తీసిందని అధికార టీఎంసీ ఆరోపించింది. ఈ ఘటనపై బీజేపీ బెంగాల్ కో ఇంచార్జ్ అమిత్ మాల్వీయా ఎక్స్ వేదికగా టీఎంసీని నిందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించేందుకు ఓటు వేస్తు్న్నారని ట్వీట్ చేశారు. పార్టీ ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదన్న రిపోర్టులు రావడంతో గార్పేటలోని కొన్ని పోలింగ్ బూతులకు వెళ్లినట్లు ప్రనత్ తుడు చెప్పారు. అకాస్మాత్తుగా టీఎంగీ గుండాలు నా కారుపై ఇటుకలతో దాడి చేశారని, నా భద్రతా సిబ్బంది గాయపడ్డారని, ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్ల తలకు గాయాలు అయ్యాయని చెప్పారు.
Mamata Banerjee is murdering democracy in Bengal. Now, TMC goons attack BJP’s Jhargram (a Tribal seat) candidate and ABP Ananda’s crew. Despite attempts to preclude people from casting vote, West Bengal has one of the highest voter turnout across the country. People are voting to… pic.twitter.com/ZMdTPhxiYw
— Amit Malviya (@amitmalviya) May 25, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!