NTV Telugu Site icon

Amit Shah: ఏపీ, ఒడిశాలో గెలవబోతున్నాము.. అమిత్ షా ధీమా..

Amit Shah

Amit Shah

Amit Shah: లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. జూన్ 1న చివరిదైన ఏడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఎంపీ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల తో పాటు మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, అలాగే మిత్రపక్షం చంద్రబాబు నాయుడితో కలిసి ఏపీలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తప్పకుండా 400 సీట్లను దాటుతుందని, ఒడిశా, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా చెప్పారు.ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరే కారణమని ఆయన అన్నారు.

Read Also: Cyclone Remal: తీవ్ర తుఫానుగా మారిన ‘రెమల్’.. బంగ్లాదేశ్, బెంగాల్ తీరాన్ని తాకనున్న తుఫాన్

147 స్థానాలు ఉన్న ఒడిశా అసెంబ్లీలో 75 సీట్లు, రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాల్లో 16-17 సీట్లు గెలుచుకుంటామని బీజేపీ అంచనా వేస్తోంది. బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు గానూ ఈ సారి 24-30 మధ్య సీట్లు సాధిస్తామని చెబుతోంది. ఏపీలో 25 ఎంపీ స్థానాలకు దాదాపుగా 17 ఎన్డీయే కూటమి ఖాతాలో పడతాయని ధీమా వ్యక్తం చేస్తోంది.

అవినీతి, గోవులు-బొగ్గు అక్రమ రవాణా, చొరబాట్లపై ప్రజలు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారని అమిత్ షా అన్నారు. సందేశ్‌ఖాలీ వివాదం, మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాల ఫలితమే అని చెప్పారు. తమిళనాడులో బీజేపీ గట్టిపోటీ ఇచ్చిందని, మాకు ఆ రాష్ట్రంలో కొత్త టీం ఉందని, ఆ రాష్ట్రంలో బీజేపీ సీట్లు, ఓట్లశాతం పెరుగుతుందని, తమిళనాడులో ఖచ్చితంగా బలమైన పునాది వేస్తామని చెప్పారు. కేరళలో పార్టీ ఈ సారి ఖాతా తెరుస్తుందని, మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు.