Kanwar Yatra: కన్వర్ యాత్ర మార్గంలో మాంసం దుకాణాలు మూసేయాలి..
- కన్వర్ యాత్రా మార్గంలో మాంసం దుకాణాలు మూసేయాలి..
- శ్రావణ మాసంలో మూసేయాలని వారణాసి అధికారుల ఆర్డర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanwar Yatra: ఉత్తర్ ప్రదేశ్‌లో జరుగుతున్న ‘కన్వర్ యాత్ర’ వివాదాస్పదంగా మారింది. యాత్రికులు వెళ్లే మార్గాల్లోని తినుబండారాలు, ఇతర దుకాణాల యజమానులు తమ పేర్లు కనిపించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని ఇటీవల ముజఫర్‌నగర్ జిల్లా పోలీసులు ఆదేశించారు. ఈ ఆదేశాలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఇది వర్ణ వివక్ష, హిట్లర్ నాజీ రూల్స్ అంటూ మండిపడ్డుతున్నాయి. ఈ నిబంధనలు రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది.
Read Also: Kishan Reddy: మోడీ ప్రభుత్వంలో దేశంలో అభివృద్ధి పరంగా అనేక మార్పులొచ్చాయి..
Also Read
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
ఓ వైపు ఈ వివాదం సాగుతుంటే, వారణాసి అధికారులు కన్వర్ యాత్ర మార్గంలోని మాంసం దుకాణాలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. మేయర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. యూపీ పోలీసులు శ్రావణ శివరాత్రికి సన్నాహాలు పూర్తి చేశారు. వారణాసి మున్సిపల్ కార్పొరేషన్, కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న అన్ని మాంసం దుకాణాలు, ఫౌల్ట్రీ దుకాణాలను శ్రావణ మాసంలో మూసేయాలని ఆర్డర్ జారీ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు యాత్రా మార్గంలో దుకాణదారులు తమ పేర్లను ప్రదర్శించాలని కోరిన తర్వాత తాజాగా వారణాసి అధికారులు ఈ ఆదేశాలను జారీ చేశారు. కన్వారియాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారణాసి మున్సిపల్ అధికారులు తెలిపారు. శ్రావణ శివరాత్రి అనేది హిందువులకు పవిత్రమైన పండగ. ఈ నెలలో శివుడికి దేశవ్యాప్తంగా పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర ప్రసిద్ధి చెందింది. భక్తులు గంగా జలాన్ని తీసుకువచ్చి శివరాత్రి రోజున శివుడికి సమర్పిస్తారు.
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!