Vaccination: గుడ్‌న్యూస్.. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఎల్లుండి నుంచే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.. గతేడాది జనవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.. క్రమంగా ఏజ్ గ్రూప్‌ను తగ్గిస్తూ వస్తున్నారు.. ఇక, ఇప్పటికే 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం గ్రీన్ ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. 12 నుండి 14 సంవత్సరాల వయస్సు గల వారికి టీకా కార్యక్రమాన్ని ఎల్లుండి (మార్చి 16వ తేదీ) నుంచి ప్రారంభించనున్నారు.. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.. మరోవైపు, ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి.. బూస్టర్ డోసు కూడా ప్రారంభం కాగా.. సీనియర్ సిటిజన్‌లకు బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కో-మార్బిడిటీ తప్పనిసరి నిబంధనను తొలగించింది కేంద్రం.
మొత్తంగా 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ బుధవారం నుంచి ప్రారంభంకాబోతోంది.. అలాగే 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు బూస్టర్ డోస్ అందించడానికి కో మార్బిడిటీ నిబంధనను తీసివేయనున్నారు. కాగా, విశ్వరూపం చూపించిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ తీసుకొచ్చింది ప్రభుత్వం.. గతేడాది జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశ్యాప్తంగా ప్రారంభమైన విషయం తెలిసిందే కగా.. ఈ ఏడాది జనవరి 10వ తేదీ నుంచి యాంటీ-కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, ఎన్నికల విధుల్లో ఉన్నవారితో సహా 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కో మార్బిడిటీ గల వ్యక్తులకు బూస్టర్ డోస్ మోతాదులను అందించడం మొదలెట్టింది ప్రభుత్వం..
Also Read
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్‌లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
తాజావార్తలు
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
-
CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్‌పై జిన్‌పింగ్ వేటు.. భారత్‌కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్‌కు షాక్
-
Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!