UP: భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాశాడంటే..!
- ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం
- భార్యను తుపాకీతో కాల్చి చంపి వ్యక్తి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణంగా జరిగింది. కేన్సర్ బాధితుడు తన భార్యను తుపాకీతో కాల్చి చంపి అనంతరం తనకు తానుగా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్ నివాసి అయిన కుల్దీప్ త్యాగి.. భార్య నిషు త్యాగిని తుపాకీతో కాల్చి చంపి అనంతరం కుల్దీప్ త్యాగి కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడని చెప్పారు. బుధవారం ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Also Read
ఇది కూడా చదవండి: Baahubali 1 : ప్రపంచ యాత్రలో మరో ఘట్టానికి చేరుకున్న ‘బాహుబలి’
బాధితుడు సూసైడ్ నోట్‌లో తనకు కేన్సర్ ఉందని.. చికిత్స ఖర్చులు కుటుంబానికి భారంగా ఉండకూడదని సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలిపారు. తన భార్యతో జీవితాంతం కలిసి ఉంటానని మాట ఇచ్చానని.. అందుకే ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నాడు. తనకు కేన్సర్ ఉందని కుటుంబ సభ్యులకు తెలియదని కూడా రాసికొచ్చాడు. కుల్దీప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే కేన్సర్ రోగం మానసికంగా బాగా కలిసి వేసిందని పేర్కొన్నాడు.
ఇక సంఘటన జరిగిన సమయంలో కుల్దీప్ వృద్ధ తండ్రి, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. సూసైడ్ నోట్‌ను బట్టి హత్యా, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ మిశ్రా తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించామని.. దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Bhu Bharathi: నేడు భూ భారతి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!