PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీని తెగ పొగిడిన అమెరికా మీడియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Media Praises PM Modi: ఉజ్బెకిస్తాన్ లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షింది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై భారత ప్రధాని మోదీ ఏ విధంగా స్పందిస్తారో అని అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు ఆసక్తిగా చూశాయి. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధినేత పుతిన్, భారత ప్రధాని మోదీలు తొలిసారిగా ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, ఉక్రెయిన్ యుద్ధంపై 55 నిమిషాల పాటు చర్చ జరిగింది.
అయితే ఈ సమావేశంలో పీఎం మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాల కాలం కాదంటూ పుతిన్ తో నేరుగా చెప్పారు. అయితే ప్రధాని మోదీ ఇలా చెప్పడాన్ని అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా గొప్పగా ప్రశంసిస్తూ పలు కథనాలను రాసింది. ‘‘ ప్రధాని మోదీ ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్ ను మందలించారని’’ అని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. పుతిన్ ను మందలిస్తూ.. నేటి యుగం యుద్ధాల యుగం కాదని.. దీనిపై మీతో ఫోన్ లో కూడా మాట్లాడానని ప్రధాని మోదీ, పుతిన్ తో అన్నారని వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. అన్ని వైపుల నుంచి పుతిన్ పై ఒత్తడి ఉందని పేర్కొంది.
Also Read
- Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
Read Also: Narendra Modi : కింగ్ ఖాన్ మోడీ భజన!
ప్రధాని మోదీ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ వివాదంపై మీ వైఖరి గురించి, మీ ఆందోళన గురించి నాకు తెలుసని.. వీలైనంత త్వరగా దీన్ని ఆపడానికి మేము మా వంతకు కృషి చేస్తున్నామని.. అయితే ఉక్రెయిన్ మాత్రం చర్చలను పక్కన పెట్టిందని.. వారు సైనిక మార్గాల ద్వారానే లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. అయినప్పటికీ అక్కడ ఏం జరుగుతుందో మేము ఎల్లప్పుడు మీకు తెలియజేస్తామని మోదీతో పుతిన్ అన్నారు.
మరో ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్.. ఇండియా లీడర్ పుతిన్‌కి ఇప్పుడు యుద్ధ యుగం కాదని చెప్పారు అని హెడ్డింగ్ పెట్టి కథనాన్ని ప్రచురించింది. ఇరు నాయకులు చరిత్రను ప్రస్తావించారని.. ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు సాగాయని.. ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ ఆందోళనలను అర్థం చేసుకుంటున్నట్లు పుతిన్ అన్నారని.. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, పుతిన్ తో సమావేశం అయినతర్వాత మోదీ, పుతిన్ తో సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచురించింది.
తాజావార్తలు
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!