US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మన దేశంలో హీట్ పెంచుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే, ఈ సారి యూఎస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారితో భారతదేశానికి సంబంధం ఉండటమే. అధికార డెమెక్రాట్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ నిలబడ్డారు. ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్న తర్వాత ఆమెకు ఈ అవకాశం దక్కింది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరుపును డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉండగా, ఆయనకు వైస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ పోటీలో ఉన్నారు.
కమలా హారిస్‌తో పాటు జేడీ వాన్స్‌కి భారతదేశంతో సంబంధాలు ఉన్నాయి. కమలా హారీస్ పూర్వీకులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కాగా, జేడీ వాన్స్ భార్య ఉష చిలుకూరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్ ప్రెసిడెంట్ కావాలని తమిళనాడు కోరుకుంటుంటే, ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచి ఆయనకు వైస్ ప్రెసిడెంట్‌గా జేడీ వాన్స్ కావాలని ఏపీ కోరుకుంటోంది. దీంతో ఇరువురు కోసం అటు తమిళనాడు, ఇటు ఏపీల్లో పూజలు నిర్వహిస్తున్నారు.
Read Also: J&K Terror Attacks: ఉగ్రవాదులు జైలుకు లేదా “నరకానికి”.. పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం..
ఏపీలో హిందూ పూజారి సుబ్రమణ్య శర్మ జేడీ వాన్స్ గెలుపుకోసం పూజలు చేశారు. సాయిబాబా విగ్రహం వద్ద ఆయన వైస్ ప్రెసిడెంట్ కావాలని ప్రార్థనలు చేశారు. జేడీ వాన్స్ భార్య ఉష ఇద్దరూ మేల్ లా స్కూల్‌లో తొలిసారి కలుసుకున్నారు. 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిజానికి ఉషా ఇప్పటి వరకు తన పూర్వీకుల గ్రామమైన వడ్లూరికి రాలేదు. చివరిసారిగా ఉషా తండ్రి మూడేళ్ల క్రితం వచ్చారు. ఊష వాన్స్ తాతలది పశ్చిమ గోదావరి జిల్లా వడ్లూర్. కాగా, ఆమె తాత చెన్నై వెళ్లి స్థిరపడగా, ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిలయ్యారు.
మరోవైపు ట్రంప్ ప్రత్యర్థి కమలా హారిస్ తాతల స్వస్థలం తమిళనాడులోని తులసేంద్రపురం. ఆమె తాత పీవీ గోపాలన్ దశాబ్ధాల క్రితం ఈ గ్రామాని వదిలి అమెరికా వెళ్లారు. కానీ ఆమె కుటుంబం ఇప్పటికీ ఈ గ్రామంతో సంబంధాలు కొనసాగిస్తోంది. గ్రామంలో గుడి కోసం రెగ్యులర్‌గా దానాలు చేస్తుంటారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రామ ప్రజలతో పాటు తమిళనాడు కమలాహారిస్‌ని సొంత మనిషిలా చూస్తోంది. ఆమె అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఊర్లో ఆమెకు సంబంధించి బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆమె గెలుపుకోసం పూజలు చేస్తున్నారు.