UPSC Tutor: శ్రీరాముడిని అక్బర్‌తో పోల్చిన ట్యూటర్.. విమర్శల దాడితో క్షమాపణలు..
- యూపీపీఎస్ ట్యూటర్‌పై విమర్శల వెల్లువ..
- క్లాసులో శ్రీరాముడికి అక్బర్‌తో పోలిక..
- చివరకు క్షమాపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC Tutor: ప్రముఖ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ట్యూట్యర్ శుభ్ర రంజన్ వివాదంలో ఇరుక్కున్నారు. శ్రీరాముడిని మొఘల్ చక్రవర్తి అక్బర్‌తో పోల్చడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాముడని అక్బర్‌తో పోల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు..? అయితే, విమర్శలు దాడి ఎక్కువ కావడంతో శుభ్ర రంజన్ క్షమాపణలు చెబుతూ నోట్ విడుదల చేశారు.
యూపీఎస్‌సీ సీఎస్‌ఈ కోచ్ శుభ్రరంజన్ క్లాసు చెబుతూ.. మొఘల్ చక్రవర్తి అక్బర్, రాముడి కంటే శక్తివంతమైనవాడు అని హిందువుల మనోభావాలను కించపరిచినట్లు పలువరు ఆరోపణలు చేశారు. ఎక్స్ వేదికగా ఓ నెటిజన్ తాను సైబర్ పోలీస్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఆమె దూషణలు హిందూ మనోభావాలను దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆరోపించారు.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
Read Also: MP Shocker: చెల్లిపై అత్యాచారం, తల్లి ముందే హత్య.. ఎంపీ ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు..
విమర్శలు ఎదురవ్వడంతో శుభ్ర రంజన్ తన క్లాసు గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైరల్ అవుతున్న వీడియో తన క్లాసులోని చిన్న భాగం మాత్రమే అని చెప్పారు. ‘‘ ప్రభు శ్రీరాముడి రాజ్యం ఆదర్శవంతమైన రాజ్యం అని నేను తెలియజేయాలనుకుంటున్నాను అని పూర్తి వీడియో ఉపన్యాసం చూడటం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు’’ అని ఆమె అన్నారు. కాంపిటేటివ్ స్టడీలో ఇది భాగమని, ఏదైనా తప్పుగా వ్యాఖ్యానించినందుకు చింతిస్తున్నానని ఆమె చెప్పారు.
ఇదిలా ఉంటే ఆమె శ్రీరాముడిని అక్బర్‌తో పోల్చి యూపీఎస్‌సీ అభ్యర్థుల మనసుల్ని భ్రష్టుపట్టించారని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని మరో నెటిజన్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అక్బర్‌ని శ్రీరాముడితో పోలిస్తే తప్పేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. ‘‘భగవాన్ ప్రభు శ్రీ రామ్ భారతదేశం యొక్క అత్యుత్తమ ఆధ్యాత్మిక వారసత్వం, నాగరికత మరియు సాంస్కృతిక చరిత్రను సూచిస్తుంది. ప్రభు శ్రీరామునిపై మరియు ఆయన చూపిన మార్గంపై మాకు అత్యంత గౌరవం మరియు విశ్వాసం ఉన్నాయి. ఒక సంస్థగా, మేము మరియు మా సభ్యులందరూ అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఉన్నాము. ” అని ఆమె చెప్పారు.
She is UPSC coach @ShubhraRanjan.
She is comparing Bhagwan Shri Ram with Mughal Islamic Invader Jalaluddin Akbar.
This is totally unacceptable.
She should apologize and stop making such comparisons in her lectures. pic.twitter.com/1ttPxQK4JZ
— Sunanda Roy 👑 (@SaffronSunanda) July 27, 2024
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!