NTV Telugu Site icon

UP: విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన యోగి సర్కార్.. యూపీపీఎస్సీ పరీక్షలపై కీలక నిర్ణయం

Up

Up

విద్యార్థుల ఆందోళనలతో ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల డిమాండ్లకు తలొగ్గింది. యూపీపీఎస్సీ పరీక్షలను ఒకే రోజులో నిర్వహించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. కొద్ది రోజులుగా విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతోంది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో యోగీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ సంజయ్ శ్రీ నెత్ అధ్యక్షతన ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ భేటీలో ప్రిలిమినరీ పరీక్ష 2024ని ఒకే రోజులో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Australians: షాకింగ్ రిపోర్టు.. ప్రతి ముగ్గురిలో ఒకరు పోర్న్ వాచ్!

యూపీపీఎస్సీ పీసీఎస్, ఆర్వో, ఏఆర్వో పరీక్షలన్నీ ఒకేసారి నిర్వహించాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత కొద్ది రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఉదృతం కావడంతో యోగి సర్కార్ దిగొచ్చింది. పరీక్షలన్నీ ఒకేరోజు నిర్వహించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.కమిషన్ చైర్మన్ సంజయ్ శ్రీ నెత్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలపై కమిషన్.. ఒక కమిటీని ఏర్పాటు చేసింది. తాజా నిర్ణయంతో దాన్ని రద్దు చేసింది.

ఇది కూడా చదవండి: Art of Living Ravi Shankar meets Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌తో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ భేటీ.. గొప్ప మార్గం చూపారు..

 

Show comments