UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- యూపీఐ ఎండీఆర్ ఛార్జీలపై వ్యాపారుల్లో ఆందోళన..
- డిజిటల్ నుంచి క్యాష్ ఎకానమీ వైపు వెళ్లే అవకాశం..?
- ముఖ్యంగా చిన్న వ్యాపారుల్లో భయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Charges: రూ.2,000కు పైబడిన కొన్ని UPI వ్యాపార లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి ‘‘మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR)’’ అమలవుతుందని కేంద్రం ప్రకటించింది. అయితే, దీనిపై ఇప్పుడు చాలా మందిలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా రిటైర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఛార్జీ వల్ల చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపుల నుంచి నగదు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (RAI) సీఈఓ కుమార్ రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్తగా అమలు కాబోయే UPI ఛార్జీలు కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. దీనిని కస్టమర్లు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. పర్సన్ టూ మర్చంట్ (P2M) UPI లావాదేవీల్లో రూ.2,000 మించితే 0.4 శాతం ఎండీఆర్ వసూలు చేయనున్నారు. అయితే, దీనిని కస్టమర్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఛార్జీ సదరు వ్యాపారి నుంచి పేమెంట్ సిస్టమ్‌కు చేరుతుంది. కొత్త విధానంలో డిజిటల్ చెల్లింపులు రూ. 2000 మించితే రూ. 12, రూ. 50000 వేల చెల్లింపులపై రూ. 200, రూ. 75000 లేదా అంతకన్నా ఎక్కువ మర్చంట్ లావాదేవీలపై గరిష్టంగా రూ. 300 ఎండీఆర్‌ను పరిమితం చేశారు.
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
- Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
కొత్త విధానం వల్ల కస్టమర్లు ఎక్కడా యూపీఐ చెల్లింపులపై ఛార్జీ చెల్లించరు. పర్సన్ టూ పర్సన్ (P2P) పూర్తిగా ఉచితంగానే జరుగుతాయి. రూ. 2000 వరకు వ్యాపారికి చెల్లించే చెల్లింపులపై ఎలాంటి ఎండీఆర్ లేదు. నెలకు యూపీఐ QR ద్వారా రూ. 1 లక్ష వరకు స్వీకరించే వ్యాపారులకు కూడా ఎలాంటి ఎండీఆర్ లేదు. దేశంలో పర్సన్ టూ మర్చంట్(P2M) లావాదేవీల్లో సుమారు 96 శాతం ప్రభావితం కావని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఎండీఆర్ ను ప్రభుత్వం లేదా NPCI వసూలు చేసే పన్ను కాదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. ఇది బ్యాంకులు, పేమెంట్ యాప్‌ల వంటి యూపీఐ పేమెంట్ ఎకోసిస్టమ్‌లోని భాగస్వాములకు పంపిణీ అయ్యే ఛార్జీ అని తెలిపింది.
కస్టమర్లకు ఉచితమే, చిన్న వ్యాపారుల్లో ఆందోళన..
ఇదే సమయంలో వ్యాపారులు డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి అదనపు డబ్బులు చెల్లించాల్సి వస్తే వారు డిజిటల్ పేమెంట్స్ నుంచి నగదు వైపు వెళ్లే అవకాశం ఉంది. ఇదే సమయంలో దసరా, దీపావళి పండగ సమయంలో ఛార్జీ అమలును ప్రశ్నించారు. పండగల సమయంలో రిటైల్ అమ్మకాలు కీలకంగా ఉండే సమయంలో డిజిటల్ చెల్లింపులపై వ్యాపారులు అదనపు భారాన్ని మోపొచ్చని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారులు ఎండీఆర్‌ను కస్టమర్లపై మోపే అవకాశం కూడా ఉంటుందని, ఒక వేళ కస్టమన్ ఈ ఛార్జీని చెల్లించనంటే, నగదు ఇవ్వాలని కోరే అవకాశాలు కూడా ఉన్నాయని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!