Vande Bharat Express: దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు 11 వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు భారత ప్రధాని నరేంద్రమోదీ భోపాల్-న్యూఢిల్లీల మధ్య 11వ వందేభారత్ ట్రైన్ ప్రారంభించారు. సెమీ హైస్పీడ్ రైళ్లను ఇండియా వ్యాప్తంగా ప్రవేశపెట్టాలని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు దేశ రాజధాని ఢిల్లీని కలుపుతూ.. వివిధ నగరాల నుంచి నాలుగు రైళ్లను ప్రారంభించారు. ప్రస్తుతం భోపాల్-ఢిల్లీల మధ్య 708 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 గంటల 45 నిమిషాల వ్యవధిలోనే రైలు చేరుకోనుంది.
ఇప్పటి వరకు ప్రారంభం అయిన వందే భారత్ రైళ్లు..
1. ముంబై సెంట్రల్- అహ్మదాబాద్- గాంధీనగర్,
2. ముంబై- సాయినగర్ షిర్డీ,
3. ముంబై-షోలాపూర్,
4. న్యూఢిల్లీ-వారణాసి,
5. న్యూఢిల్లీ-శ్రీ వైష్ణో దేవీ మాత కట్రా,
6. అంబ్ అందౌౌరీ- న్యూ ఢిల్లీ,
7. మైసూరు – పురట్చి తలైవర్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్
8. నాగ్ పూర్-బిలాస్ పూర్
9. హౌరా-న్యూ జల్పాయ్ గురి
10. సికింద్రాబాద్-విశాఖపట్నం
11. భోపాల్-న్యూ ఢిల్లీ
కొత్తగా ప్రారంభం కాబోయే వందేభారత్ ట్రైన్స్ ఇవే..
చెన్నై-కోయంబత్తూర్ భారత్ ఎక్స్‌ప్రెస్
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఏప్రిల్ 8, 2023న చెన్నై స్టేషన్ నుంచి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. ఇది 12వ వందేభారత్ ట్రైన్. చెన్నై నుంచి మైసూరుకు ఇప్పటికే ఓ వందే భారత్ ట్రైన్ నడుస్తోంది.
ఢిల్లీ – జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఏప్రిల్ 10లోపు ఢిల్లీ-జైపూర్ నగరాల మధ్య వందేభారత్ రైల్ ప్రారంభం అవుతుందని ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో కొత్తగా ఒక వందేభారత్ రైలును ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇది రెండో వందేభారత్ రైలు అవుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖల మధ్య ఓ రైలు నడుస్తోంది.
పాట్నా-రాంచీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రాంచీ (జార్ఖండ్) నుండి పాట్నా (బీహార్) మార్గంలో 15వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. సెమీ-హై స్పీడ్ రైలు ప్రయాణాన్ని 6 గంటల్లో కవర్ చేస్తుంది మరియు ఏప్రిల్ 25న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.