UP Priest Gets Life Sentence For Kidnapping, Raping College Student: కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన పూజారికి జీవిత ఖైదు విధించింది ఉత్తర్ ప్రదేశ్ కోర్టు. ముజఫర్ నగర్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఛోటేలాల్ యాదవ్ నిందితుడు ప్రేమ్ చంద్ గోస్వామికి జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 25,000 జరిమానా విధించారు. ప్రభుత్వ న్యాయవాది రాజీవ్ శర్మ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Read Also: Meta:కెనడాలో ఐఐటీ గ్రాడ్యుయేట్ తిప్పలు.. రెండురోజుల్లోనే జాబ్ తీసేసిన మెటా
రాజీవ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం..సెకండ్ ఇయర్ కాలేజీ విద్యార్థిని ఆలయం దర్శనానికి వెళ్లిన సమయంలో కిడ్నాప్ కు గురైంది. ఈ ఘటన 2016లో జరిగింది. ఆలయ పూజారి ప్రేమ్ చంద్ గోస్వామి యువతిని కిడ్నాప్ చేసి నాలుగు నెలల పాటు ఆమెను బందీగా ఉంచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత కాలేజ్ విద్యార్థిని ఆచూకీ లభించింది. ఈ క్రమంలో పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. కిడ్నాప్ చేసిన తర్వాత విద్యార్థిని రహస్యంగా ఉంచుతూ.. తరచుగా స్థావరాలు మారుస్తూ ఉండే వాడని తేలింది. విచారణ అనంతరం పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయాగా.. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ప్రేమ్ చంద్ గోస్వామిని దోషిగా తేల్చింది కోర్టు. జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.