Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Up Minor Girl Climbs Mobile Tower Love Marriage Drama Mau

High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్‌పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..

Published Date :May 2, 2026 , 8:56 pm
By Shiva Ganesh
High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్‌పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
  • Follow Us :
  • google news
  • dailyhunt

High Voltage Drama: ప్రేమ పిచ్చో.. లేక పంతమో తెలియదు కానీ, తన ప్రేమను గెలిపించుకోవడానికి ఓ బాలిక చేసిన పని ఇప్పుడు ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా, ఘోసి కోత్వాలి పరిధిలో ఉన్న లఖానీ ముబారక్‌పూర్ గ్రామంలో సినిమా ఫక్కీలో జరిగిన ఒక హై-వోల్టేజ్ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలంటూ ఓ మైనర్ బాలిక మొబైల్ టవర్ ఎక్కి గ్రామస్థులను, పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అసలు ఏం జరిగిందంటే..

మాణిక్‌పూర్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక, పొరుగు గ్రామమైన లఖానీ ముబారక్‌పూర్‌కు చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ, పెద్దలు వారి ప్రేమకు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక, శనివారం గ్రామంలోని ఒక ఎత్తైన మొబైల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. గ్రామస్థులు టవర్ పై ఉన్న బాలికను చూసి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని మైకుల ద్వారా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తన ప్రియుడిని అక్కడికి పిలిపించి పెళ్లి చేయాలని, లేదంటే కిందకు దిగేది లేదని ఆమె మొండికేసింది. ప్రియుడు గానీ, అతని కుటుంబం గానీ అక్కడికి రాకపోవడంతో దాదాపు రెండు గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది. చివరికి పోలీసులు “మీ పెళ్లి చేస్తాం” అని హామీ ఇవ్వడంతో ఆమె శాంతించి సురక్షితంగా కిందకు దిగింది.

Also Read

  • Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
  • Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
  • Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్‌కు షాక్..
  • Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..

బాలికను సురక్షితంగా దించిన పోలీసులు, అనంతరం ఆమెను, యువకుడి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఈ విషయంపై అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనూప్ కుమార్ స్పందిస్తూ.. “బాలిక మైనర్ కావడంతో ప్రస్తుతం ‘మిషన్ శక్తి’ బృందంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. యువత భావోద్వేగాలకు లోనై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. వివాహం కంటే విద్య, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వారికి అవగాహన కల్పిస్తున్నాం” అని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఇరు పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #TrendingNow
  • HighVoltageDrama
  • LoveStoryGoneWrong
  • Mau
  • MissionShakti

తాజావార్తలు

  • High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్‌పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..

  • KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..

  • Iran: ఉరిశిక్షలతో హడలెత్తిస్తున్న ఇరాన్..

  • Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

  • Lavanya : మా రామ్ చరణ్‌ బావకి థాంక్స్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions