Site icon NTV Telugu

Rahul Gandhi vs BJP: స్పీకర్‌నే లెక్కచేయరు.. రాహుల్‌‌గాంధీతో యూపీ మంత్రి వాగ్వాదం

Rahulgandhi

Rahulgandhi

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీతో యూపీ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ వాగ్వాదం పెట్టుకున్నారు. రాయ్‌బరేలీ నియోజకవర్గ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ఈ ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Charlie Kirk: భర్త వారసత్వాన్ని కొనసాగిస్తా.. చార్లీ కిర్క్ భార్య ఎరికా భాగోద్వేగ ప్రసంగం

రాహుల్‌గాంధీ రెండు రోజుల పాటు సెప్టెంబర్ 10-11 తేదీల్లో సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో పర్యటించారు. ఇందులో భాగంగా యూపీ రాజధాని లక్నోలో రాయ్‌బరేలీలో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిషా) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ ‌గాంధీ, అమేథీ ఎంపీ కేఎల్. శర్మ, మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్, అధికారులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి తానే అధ్యక్షత వహిస్తానని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఏదైనా మాట్లాడాలంటే తనను అడగాలని సూచించారు. ఇంతలో మంత్రి దినేష్ జోక్యం చేసుకుని.. మీరు లోక్‌సభ స్పీకర్‌నే లెక్కచేయరు.. అలాంటప్పుడు మీరు చెప్పినట్లు మేము వినడమేంటి? అని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో అమేథీ ఎంపీ శర్మ కలుగజేసుకుని రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలిచి మంత్రిపై మండిపడ్డారు. దీంతో అక్కడున్న అధికారులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఇది కూడా చదవండి: SBI: ఎస్బీఐ బ్యాంకులో మరో మోసం.. నాణ్యత లేని బంగారం భద్రపరచి రూ. 23 లక్షలు తీసుకున్న వైనం

ఆశ్చర్యమేంటంటే దినేష్ ప్రతాప్ సింగ్ ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తే. 2022లోనే బీజేపీలో చేరారు. ప్రస్తుతం యూపీ మంత్రిగా ఉన్నారు. అయితే లోక్‌సభ స్పీకర్‌ను రాహుల్ గాంధీ పట్టించుకోనప్పుడు.. తానెందుకు రాహుల్ గాంధీ చెప్పినట్లుగా వినాలని మంత్రి ప్రతాప్ అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు.

 

Exit mobile version