Uttar Pradesh: అబ్బాయిగా నిద్రపోయి, అమ్మాయిగా లేచాడు.. తెలియకుండా లింగమార్పిడి..
- ఉత్తర్ ప్రదేశ్‌లో ఘోరం..
- తెలియకుండా అబ్బాయికి లింగమార్పిడి..
- వ్యక్తితో కుమ్మక్కై ఆస్పత్రి దారుణం..
- పెళ్లికి సిద్ధపడ్డ నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. ఒక పురుషుడికి బలవంతంగా ‘‘లింగమార్పిడి’’ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీలోని ముజఫర్‌నగర్‌లోని స్థానిక వైద్య కళాశాలకు చెందిన వైద్యులు, మరో వ్యక్తితో కుమ్మక్కై బాధితుడికి ఇలా సర్జరీ చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసు భారతీయ కిసాన్ యూనియర్(బీకేయూ) నిరసనలకు దారి తీసింది. మన్సూర్‌పూర్ లోని బేగ్‌రాజ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని సంజక్ గ్రామ నివాసి ముజాహిద్‌గా గుర్తించారు. తాను ఓం ప్రకాష్ చేతిలో మోసపోయానని ఆరోపించారు. ఓం ప్రకాష్, ముజాహిద్‌కి శస్త్రచికిత్స చేయాలని వైద్య కళాశాలలో వైద్యులను ఒప్పి్ంచాడని, తన జననాంగాలను తొలగించి బలవంతంగా లింగ మార్పిడి చేయించాడని ఆరోపించారు.
Read Also: JBL Live Beam 3 Price: జేబీఎల్ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్.. 48 గంటల ప్లేబ్యాక్ టైమ్!
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
గత రెండేళ్లుగా ఓం ప్రకాష్ తనను బెదిరిస్తూ వేధిస్తున్నాడని ముజాహిద్ పేర్కొన్నాడు. ముజాహిద్‌కి వైద్యపరమైన సమస్య ఉందని చెప్పి ప్రకాష్ అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది మత్తుమందు ఇచ్చి లింగమార్పిడి చేసినట్లు బాధితుడు వాపోయాడు. ‘‘ అతను నన్ను ఇంటికి తీసుకువచ్చిన ఒక రోజు తర్వాత స్పృహలోకి వచ్చాను. నేను అబ్బాయి నుంచి అమ్మాయిగా మార్చబడ్డాను’’ అని ముజాహిద్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ఇప్పుడు తనతో కలిసి జీవించాల్సి ఉంటుందని ఓం ప్రకాష్ తనతో చెప్పాడని, సమాజం, తన కుటుంబం ఎవరూ నన్ను అంగీకరించాడని చెప్పాడని ముజాహిద్ చెప్పాడు. ఇదే కాకుండా తన తండ్రిని చంపుతానని, తన కుటుంబానికి చెందిన భూమిని స్వాధీనం చేసుకుంటానని బెదిరించాడని ఆరోపించాడు.
మగవాడి నుంచి అమ్మాయిలా మార్చానని, తనతోనే జీవించాలని, కోర్టు మ్యారేజ్ కోసం న్యాయవాదిని సిద్ధం చేసినట్లు ఓం ప్రకాష్ చెప్పడాని ముజాహిద్ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన బీకేయూ కార్మికులు ఓంప్రకాష్‌పైనా, సంబంధిత వైద్యులపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు నాయకుడు శ్యామ్‌పాల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసనకు దిగారు. సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీసులు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. ఆస్పత్రి అక్రమ అవయవాల వ్యాపారానికి కేంద్రంగా మారిందని, లింగమార్పిడి సర్జరీలు చేస్తున్నాంటూ అతను ఆరోపించాడు. ఈ ఘటనపై ముజాహిద్ తండ్రి జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఓం ప్రకాష్‌ని అరెస్ట్ చేశారు. దీనిపై బాధితుడు ముజాహిద్‌కి రూ. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని బీకేయూ డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!