NTV Telugu Site icon

Yogi Adityanath: కేజ్రీవాల్, ఆప్ మంత్రులు యమునాలో స్నానం చేయగలరా? యూపీ సీఎం సవాల్

Yogiadityanath

Yogiadityanath

వింటర్ సీజన్‌లో దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడి విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా ఆప్-బీజేపీ నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కేజ్రీవాల్‌, ఆప్ మంత్రులకు సవాల్ విసిరారు. తాను, యూపీ కేబినెట్ మంత్రులంతా ప్రయాగ్‌రాజ్‌లోని సంగమంలో స్నానం చేశామని.. తమకు లాగా కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రులు కూడా యమునా నదిలో స్నానం చేయగలరా? అని యోగి ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Maruti Suzuki Cars: డిజైర్ నుంచి వ్యాగన్ఆర్ వరకు.. పెరగనున్న మారుతీ కార్ల ధరలు.. లిస్ట్ ఇదే..

దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కిరారీలో జరిగిన ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొని ప్రసంగించారు. ఆప్ నాయకులు.. ఢిల్లీని చెత్తగా కుప్పగా మార్చారని విమర్శించారు. పదే పదే కేజ్రీవాల్.. యూపీని విమర్శిస్తారని.. కానీ ఇప్పుడు ప్రజలంగా యూపీనే నమునాగా చూస్తున్నారన్న సంగతి మరిచిపోవద్దని హితవు పలికారు. యూపీని చూసి ఆప్ నేర్చుకోవాలన్నారు. అభివృద్ధి అంటే ఏంటో ఒకసారి ఢిల్లీ రోడ్లు.. యూపీ రోడ్లు చూస్తే అర్థమవుతుందన్నారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు, రోహింగ్యాలు ఢిల్లీలో స్థిర నివాసం కల్పించారని.. వారికి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ఇళ్లల్లో ఆధార్ కార్డులు ఇస్తున్నారని విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి త్రివేణి సంగమంలో స్నానం చేయడమంటే. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మానికి చిహ్నంగా అభివర్ణించారు. ఆధ్మాత్మిక శాంతి, మతపరమైన భక్తి, సామాజిక సంక్షేమాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Tata Car: రూ. 6.20 లక్షల ధర.. సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్.. ఈ టాటా కారు పేరిట మరో రికార్డు

దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ట్రై చేస్తోంది. ఇలా రెండు పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. ఇప్పటికే రెండు పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలు ప్రకటించాయి.