కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ కారు అతి వేగంగా నడిపి చిక్కుల్లో పడ్డారు. బీహార్‌లో టోల్‌ఫ్లాజా దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా కేంద్రమంత్రి కారు అతి వేగంగా వెళ్లినట్లు గుర్తించింది. దీంతో చిరాగ్ పాసవాన్ కారుకు ఈ-చలానా విధించబడింది. రెండు వేల రూపాయల వరకు చలానా విధించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.