Delhi: ఈనెల 21న మోడీ అధ్యక్షతన ఆల్‌పార్టీ మీటింగ్.. లోక్‌సభ సమావేశాలపై చర్చ
- ఈనెల 21న మోడీ అధ్యక్షతన ఆల్‌పార్టీ మీటింగ్
- లోక్‌సభ సమావేశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2024-2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ అధ్యక్షతన ఆర్థిక వేత్తలు, నీతి అయోగ్ అధికారులతో భేటీ అయి బడ్జెట్ కూర్పుపై సూచలు, సలహాలు స్వీకరించారు.
ఇది కూడా చదవండి: Madhya pradesh: పోలీస్‌స్టేషన్‌లో పెళ్లి దుస్తుల్లో గిరిజన యువకుడు మృతి.. భగ్గుమన్న కుటుంబ సభ్యులు
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే ఈనెల 21న అఖిలపక్ష సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానాలు పంపింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు.. పార్టీ ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానాలు పంపారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో భేటీ జరగనుంది.
ఇది కూడా చదవండి: Bhukya Yashwant: సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మౌంట్ క్యాంగ్ యాట్సీ-2 అధిరోహకుడు..
ఇక పార్లమెంట్ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. గత ప్రత్యేక సమావేశాలు హాట్ హాట్ సాగాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వం ధ్వజమెత్తారు. మరోసారి లోక్‌సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరోసారి అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా నీట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చే సూచనలు కనిపిస్తు్న్నాయి. అలాగే రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కూడా ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. జరగబోయే సమావేశాలు హాట్ హాట్‌గానే సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Delhimeeting
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!