Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు
- కీలక అంశాలపై ఫోకస్
- వృద్ధి, ఉద్యోగాలపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును ప్రారంభించనుంది. 2027-28 కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియను అక్టోబర్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చిత పరిస్థితులు, ఆహారం, ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో సంస్కరణలను కొనసాగించడం, ఉద్యోగాల కల్పన, దేశీయ డిమాండ్‌ను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది.
అక్టోబర్ 12 నుంచి ప్రీ-బడ్జెట్ సమావేశాలు
ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన బడ్జెట్ సర్క్యులర్ 2027-28 ప్రకారం.. వ్యయ శాఖ కార్యదర్శి అధ్యక్షతన ప్రీ-బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ 12, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు నవంబర్ మధ్య వరకు కొనసాగనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల ఆర్థిక అవసరాలు, వ్యయ ప్రాధాన్యతలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.
Also Read
- ‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
- Jamia Students Protest: "2006 నుంచి ఎన్నికలు లేవు".. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
- Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
- NEET UG: నీట్-యూజీ వివాదం ఎఫెక్ట్.. పరీక్షల సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీ ఫోకస్..
మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన అవసరమైన వివరాలను యూనియన్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (UBIS)లో అక్టోబర్ 6, 2026లోగా లేదా అంతకంటే ముందే నమోదు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. నిర్దేశిత ఫార్మాట్లలో డేటా హార్డ్ కాపీలను కూడా క్రాస్ వెరిఫికేషన్ కోసం సమర్పించాలని తెలిపింది.
వృద్ధి, ఉద్యోగాలపై దృష్టి
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో.. దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు సంస్కరణలను కొనసాగించడంపై 2027-28 బడ్జెట్లో దృష్టి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగాల కల్పన, దేశీయ డిమాండ్‌ను పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రీ-బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత 2027-28 బడ్జెట్ అంచనాలు, 2026-27 సవరించిన అంచనాలను తాత్కాలికంగా ఖరారు చేయనున్నారు. వివిధ శాఖలతో విస్తృత చర్చలు జరిపిన అనంతరం ఆయా మంత్రిత్వ శాఖలు, విభాగాలకు తాత్కాలిక వ్యయ పరిమితులను సూచించనున్నారు.
ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలు, ఆదాయ అంచనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత తుది వ్యయ పరిమితులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించనుంది. తుది వ్యయ గణాంకాలను 2026 డిసెంబర్ చివరి నాటికి లేదా 2027 జనవరి ప్రారంభంలోగా UBISలో నమోదు చేసి ప్రతిబింబించేలా చేయనున్నారు. అలాగే కేంద్ర పన్నులు, సుంకాలు, సర్‌చార్జీలు, సెస్సుల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన అంచనాలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు బడ్జెట్ విభాగానికి అందించాల్సి ఉంటుంది.
నిర్మలా సీతారామన్‌కు అరుదైన ఘనత
మోడీ 3.0 ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్ కానుంది. అదే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టనున్న 10వ కేంద్ర బడ్జెట్ ఇదే కావడం విశేషం. భారత రాజకీయ చరిత్రలో వరుసగా 10 బడ్జెట్లు ప్రవేశపెట్టడం అరుదైన ఘనతగా నిలవనుంది.
తాజావార్తలు
-
‘Raids for Reels’: కేఎన్ నెహ్రూ నివాసంలో సోదాలు.. ‘రీల్స్ కోసమే దాడులు’ అంటూ స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు!
-
Dasharatha Madhav: ఐఐటీ ర్యాంక్.. గోల్డ్ మెడల్.. టాటా ఏరో స్పేస్‌లో జాబ్.. చివరకు నటుడిగా!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Jamia Students Protest: “2006 నుంచి ఎన్నికలు లేవు”.. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
-
AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
ట్రెండింగ్
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!