Delhi Car Blast: ఉగ్రవాది ఉమర్ టార్గెట్ మోడీ ప్రారంభించిన దేవాలయం! దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి..!
- ఉగ్రవాది ఉమర్ టార్గెట్ మోడీ ప్రారంభించిన దేవాలయం!
- దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడు తర్వాత దేశ వ్యాప్తంగా డాక్టర్ల బృందం ఎన్ని కుట్రలు చేశారో తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ భారీ దాడులకే ప్లాన్ చేశాడు. ఈనెలలోనే ప్రధాని మోడీ ప్రారంభించిన అతి పెద్ద దేవాలయంపై దాడి చేసేందుకు ప్రణాళిక రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
టెర్రర్ మాడ్యూల్ ప్రకారం ఉమర్ మూడు కార్లు కొనుగోలు చేశాడు. హ్యుందాయ్ ఐ20, ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి బ్రెజ్జాలను కొనుగోలు చేశాడు. ఈ మూడు కారుల్లో సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర హ్యుందాయ్ i20 కారు పేలిపోయింది. ఇక రెండో ఎరుపు రంగు కారును తాజాగా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్ 0458 కలిగిన ఎకోస్పోర్ట్‌ను ఫరీదాబాద్‌లో ట్రాక్ చేశారు. ఇక మూడో కారు మారుతి బ్రెజ్జా కోసం గాలిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ మూడు వాహనాల్లో పెద్ద ఎత్తున ఐఈడీలు పెట్టుకుని భారీ దాడులు చేయాలని.. అంతేకాకుండా అస్సాల్ట్ రైఫిల్స్‌తో విచక్షణారహితంగా కాల్పులు కూడా జరపాలని ఉమర్ ప్లాన్ చేసుకున్నట్లుగా దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.
Also Read
అయోధ్య టార్గెట్..
ఇక ఉమర్ తదుపరి లక్ష్యం అయోధ్య అని తేల్చారు. నవంబర్ 25, 2025న అయోధ్య రామాలయంలో ‘ధ్వజారోహణం’ (జెండా ఎగురవేత) వేడుకతో పాటు ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేసే సమయంలో ఉమర్ దాడి చేయాలని ప్లాన్ వేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
ఇక ఫరీదాబాద్‌లో అమ్మోనియం నైట్రేట్, ఆర్డీఎక్స్ మిశ్రమాన్ని పెద్ద ఎత్తున దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది. ఇది మిలిటరీ-గ్రేడ్ పేలుడు పదార్థాలకు సంబంధించిందిగా తేల్చారు. ఢిల్లీలో పేలిన కారులో ఇవే ఉపయోగించారా? లేదా? అనేది ఫోరెన్సిక్ బృందాలు తేల్చనున్నాయి.

ఇక ఈ కుట్రంతా టర్కీ కేంద్రంగా జరిగినట్లుగా కనిపెట్టారు. 2022లో రూపొందించిన ప్రణాళికగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇక ఉమర్.. ప్రస్తుతం ‘ఉకాసా’ అనే కోడ్‌నేమ్‌తో పిలవబడుతున్నాడు. టర్కీలోని హ్యాండ్లర్లు.. ఉమర్‌ను ‘ఉకాసా’గానే పిలుస్తారు. ఉమర్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు సంస్థలు దృష్టిపెట్టినప్పుడు ఈ అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వచ్చాయి.
కారులో ఉన్నది ఉమరే..
ఇక కారులో ఉన్నది ఎవరన్నది సందిగ్ధం వీడిపోయింది. కారు నడిపింది ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ అని పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు నిర్ధారించాయి. కారు శిథిలాల నుంచి వెలికితీసిన అవశేషాలతో (ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలు) సరిపోలాయి. DNA పరీక్షలో ఉమర్ కుటుంబ సభ్యుల నమూనాలతో 100 శాతం సరిపోయింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!