ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడు తర్వాత దేశ వ్యాప్తంగా డాక్టర్ల బృందం ఎన్ని కుట్రలు చేశారో తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ భారీ దాడులకే ప్లాన్ చేశాడు. ఈనెలలోనే ప్రధాని మోడీ ప్రారంభించిన అతి పెద్ద దేవాలయంపై దాడి చేసేందుకు ప్రణాళిక రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.