Site icon NTV Telugu

Delhi riots case: ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు తాత్కాలిక బెయిల్..

Umar Khalid

Umar Khalid

Delhi riots case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ కేసులో నిందితుడిగా ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్ధి, ఢిల్లీ ట్రయల్ కోర్టు జైలులో ఉన్న ఉమర్ ఖలీద్‌కు ఢిల్లీ కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. తన సోదరి వివాహానికి హాజరు కావడానికి రెండు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. కోర్టు డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రూ. 20,000 వ్యక్తిగత బాండ్‌పై, అదే మొత్తంలో ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

ఉమర్ మధ్యంతర బెయిల్ కోరుతూ కర్కర్‌డూమా కోర్టును ఆశ్రయించారు. తన సోదరి వివాహం డిసెంబర్ 27 న జరగాల్సి ఉంది, ఆ వివాహానికి తన అవసరం తప్పనిసరి అని ఆయన కోర్టుకు తెలిపాడు. గతేడాది డిసెంబర్‌లో కుటుంబంలో ఒక వివాహానికి కోర్టు ఖలీద్‌కు 7 రోజలు మధ్యంత బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు, 2022లో తన సోదరి వివాహ వేడుకకు హాజరుకావడానికి అతడికి ఒక వారం మధ్యంతర బెయిల్ లభించింది.

Read Also: JINN : సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు “జిన్”

ఖలీద్ తాత్కాలిక బెయిల్‌పై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ స్పందిస్తూ.. ‘‘తన సోదరి వివాహానికి హాజరుకావడానికి ఉమర్ ఖలీద్‌కు ఐదు ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. అత్యాచారం, హత్య కేసుల్లో దోషులుగా ఉన్న గుర్మీత్ సింగ్ వంటి దోషులకు పదే పదే పెరోల్‌లు లభిస్తున్నాయి. ఈ అసమానత మన న్యాయ వ్యవస్థలో ఇబ్బందికరమైన అస్థిరత, పక్షపాతాన్ని బహిర్గతం చేస్తుంది’’ అని అన్నారు.

2020 ఢిల్లీ మత అల్లర్ల వెనక కుట్ర ఉందని ఆరోపిస్తూ, ఈ కేసులో ఉమర్ ఖలీద్‌ను సెప్టెంబర్ 2020 నుంచి కస్టడీలో ఉంచారు. తాజాగా బెయిల్ ఇస్తూ, కోర్టు కొన్ని షరతులు విధించింది. ఖలీద్ ఏ సాక్షి లేదా కేసులో సంబంధం ఉన్న ఏ వ్యక్తిని సంప్రదించొద్దని, తన మొబైల్ నెంబర్‌ను విచారణ అధికారికి అందించాలని, బెయిల్ సమయంలో ఈ నెంబర్‌కు యాక్టీవ్‌గా ఉండాలని సూచించింది. బెయిల్ ముగిసిన తర్వాత డిసెంబర్ 29 సాయంత్రం జైలు సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.

మరోవైపు, ఢిల్లీ అల్లర్ల కుట్రలో UAPA కేసులు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, ఇతరుల బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. వీరి బెయిల్‌ను ఢిల్లీ పోలీసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అల్లర్లు ఆకస్మికంగా జరిగినవి కావని, ముందస్తు ప్రణాళికతో, భారత సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.

Exit mobile version