NTV Telugu Site icon

Om Birla: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌..

Birla

Birla

Om Birla: యూకే పర్యటనకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెళ్లారు. ఈ సందర్భంగా లండన్‌లోని హైకమిషన్‌లో జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశ ప్రజాస్వామ్య విలువలను, వృద్ధిని యూకే బలంగా విశ్వసిస్తోందని తెలిపారు. అలాగే, ప్రముఖ బ్రిటన్ పార్లమెంటేరియన్లతోనూ మాట్లాడాను.. వారికి భారత ప్రజాస్వామ్యంపై బలమైన నమ్మకం ఉందన్నారు. అలాగే, ఇటీవల భారత్‌లో జరిగిన ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు మరింత దోహదపడిందన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌ను.. మాతృమూర్తిగా కీర్తిస్తున్నందుకు గర్వంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.

Read Also: RRR Custodial Torture Case : ఆర్‌ఆర్‌ఆర్‌ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్..

అలాగే, రానున్న రోజుల్లో అభివృద్ధిలో భారత్‌ ఇతర దేశాలను అధిగమించనుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు వికసిత్‌ భారత్‌ కోసం తమ వంతు సహాకారం అందిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్దేశించిన ఈ లక్ష్యం దిశగా ప్రవాస భారతీయులు చేస్తున్న కృషి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. యూకే- భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరారు. దాదాపు 17ఏళ్ల తర్వాత ఓ లోక్‌సభ స్పీకర్ యూకేలో పర్యటించడం మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా యూకే హౌస్‌ ఆఫ్ కామన్స్ స్పీకర్ లిండ్సే హోయ్‌లతో ఓం బిర్లా సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపారు.