NTV Telugu Site icon

Maharashtra Political Crisis: 22 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి..! సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు ఎసరు…?

Eknath Shinde

Eknath Shinde

మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే ఉంటాయి.. ఎప్పుడు ఎవరు సీఎం అవుతారో..? ఎప్పుడు ఎవరు తిరుగుబాటు చేస్తారో..? ఏ పార్టీ ఎమ్మెల్యే సీఎం అవుతారో కూడా చెప్పడం కొన్నిసార్లు కష్టమే.. మహా రాజకీయాలపై ఓ కథనం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.. బీజేపీతో చేతులు కలిపిన శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. అప్పటి సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై తిరుగుబాటు చేసి సఫలం అయ్యారు.. ఆ తర్వాత బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి పీఠాన్నా ఎక్కారు.. అయితే, ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే సీటుకు ఎసరు వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేనలో అసంతృప్తి నెలకొంది.. ఆయన వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్‌ అవుతారంటూ.. ఉద్ధవ్‌ థాక్రే వర్గం ఆధ్వర్యంలోని శివసేన అధికారిక పత్రిక సామ్నా పేర్కొంది..

Read also: Betting Mafia attack: రెచ్చిపోయిన క్రికెట్‌ బెట్టింగ్ మాఫియా.. డబ్బులు ఇవ్వలేదని ఇంట్లోకి చొరబడి..!

తాత్కాలిక ఒప్పందంలో భాగంగానే ఏక్‌నాథ్‌ షిండేను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారని తన ఎడిటోరియల్‌లో రాసుకొచ్చిన సామ్నా… ఇక, తొందరలోనే షిండే యూనిఫాం వదిలేయాల్సి ఉంటుందని పేర్కొంది.. ఏ క్షణంలోనైనా ఏక్‌నాథ్‌ షిండే ఆయన ముఖ్యమంత్రి యూనిఫాం తొలగించే అవకాశం ఉందని అర్థమైపోయింది.. అంధేరి ఈస్ట్‌ ఉపఎన్నికల్లో షిండే వర్గం తన అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉన్నా.. బీజేపీ దానిని అడ్డుకుందని రాసుకొచ్చింది.. అంతేకాదు.. ఈ మధ్యే జరిగిన గ్రామ పంచాయతీ, సర్పంచ్‌ ఎన్నికల్లో విజయంపై వారు చెప్పేదంతా ఫేక్‌ అని కొట్టిపారేసింది.. వాస్తవం ఏంటంటే.. షిండే వర్గంలోని దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. వారు ఏ క్షణంలోనైనా తిరుగుబాటు చేయొచ్చు.. వారిలో చాలా మంది ఏక్షణమైనా బీజేపీలో చేరే అవకాశం ఉందని పేర్కొంది.. బీజేపీ తన ప్రయోజనాల కోసం షిండేని వాడుకుంటుందని.. కనీసం నిర్ణయాలు కూడా ఆయన చేతిలో లేవు.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నిర్ణయం తీసుకుంటే.. షిండే మాత్రం వాటిని ప్రకటిస్తారని ఆరోపించింది. అంటే సామ్నా కథనం ప్రకారం.. థాక్రేపై తిరుగుబాటు చేయించి.. ఏక్‌నాథ్‌ షిండేను తాత్కాలికంగా సీఎం చైర్‌లో కూర్చోబెట్టినా.. త్వరలోనే అతడిపై ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి.. అధికారాన్ని పూర్తిస్థాయిలో బీజేపీ చేజిక్కించుకుంటుందనే అనుమానాలు నెలకొన్నాయి.