Uddhav Thackeray: భారతదేశంలో రాజకీయాలు ఇప్పుడు ఐపీఎల్ లాగా మారాయి..ఎవరు ఏ వైపు ఆడుతున్నారో ఎవరికీ తెలియడం లేదని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఈ రోజు బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో, మహారాష్ట్రలో రాజకీయాలు అధ్వాన్నంగా మారాయి.. ప్రజలు కలత చెందుతున్నారు, ప్రభుత్వం ఇప్పటికీ ప్రజల్ని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
Read Also: Aishwarya Rajinikanth: ఆ హీరోతో ప్రేమలో పడ్డ రజనీకాంత్ కూతురు.. మళ్ళీ పెళ్ళికి రెడీ?
బీజేపీ నేత, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఉద్దేశిస్తూ.. తాను ఎప్పుడూ ఎన్సీపీతో పొత్తు పెట్టుకోనని ఫడ్నవీస్ గతంలో అన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు ఠాక్రే. ఎన్సీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానన్ని కళంకం అని గతంలో వ్యాఖ్యానించిన ఫడ్నవీస్ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడని విమర్శించారు. ఇటీవల ఎన్సీపీలో చీలక విషయాన్ని గురించి ప్రస్తావించారు.
గతేడాది ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగబాటు చేయడంతో మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం పడిపోయింది. ఆ తరువాత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో ఆయన సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్సీపీ నేత అజిత్ పవార్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు షాక్ ఇచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేలతో ఎన్సీపీ బీజేపీ-షిండే ప్రభుత్వంలో చేరింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, మరో 8 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇలా రెండేళ్లలో మహారాష్ట్రలో ప్రధాన పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీలు బీజేపీతో జతకట్టాయి.
