NTV Telugu Site icon

Uddhav Thackeray: శివసేన పార్టీ పేరు, గుర్తు స్వాహా.. సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఉద్ధవ్ థాక్రే

Uddhav Thackarey

Uddhav Thackarey

Uddhav Thackeray Goes To Supreme Court After Losing Shiv Sena Name Symbol: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు, గుర్తును కేటాయిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఉద్ధవ్ థాక్రే వర్గం (యూబీటీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. షెడ్యూల్ లేకుండా అత్యవసర విచారణ చేపట్టాలని థాక్రే వర్గం తరఫు న్యాయవాది కోరగా.. అందుకు సుప్రీం అంగీకరించలేదు. సరైన పేపర్ వర్క్‌తో రేపు అత్యవసర విచారణ జాబితాలో ప్రవేశ పెట్టాలని సూచించారు. దీంతో.. థాక్రే వర్గం ఆ పనిలో నిమగ్నమైంది. కాగా.. శివసేన నుంచి గెలిచిన వారిలో 55 మంది ఎమ్మెల్యేలలో 40 మంది, 18 మంది లోక్‌సభ సభ్యులలో 13 మంది మద్దతును షిండే వర్గం కలిగి ఉంది. దీంతో.. షిండే వర్గానికి పార్టీ పేరు, గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అసెంబ్లీ ఉప ఎన్నికలు ముగిసే వరకు.. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పేరును, జ్వలించే కాగడా చిహ్నాన్ని ఉపయోగించుకోవడానికి థాక్రే వర్గానికి అనుమతి ఇచ్చింది.

Kim Jong-un: కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిక.. 48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం

ఇదిలావుండగా.. థాక్రే వర్గం శివసేన పేరు, గుర్తుని కోల్పోవడంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. దేవుడి పేరు మీద రాజకీయాలు చేయడం వల్లే.. థాక్రే వర్గానికి తగిన శాస్త్రి జరిగిందని ఆరోపించారు. మహారాష్ట్ర, అస్సాం మధ్య ‘ఆరవ జ్యోతిర్లింగ భీమాశంకర్’ విషయంలో తీవ్రస్థాయిలో విభేదాలు నెలకొన్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘శివుడు హిమాలయాల్లో నివసిస్తున్నారు. ఆయనను ఫలానా ప్రదేశానికి కుదించడం ఏమాత్రం సబబు కాదు. మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు శివుడి పేరు మీద రాజకీయాలు చేయడం మానేయాలి. శివుడి పేరుపై రాజకీయాలు చేయడం వల్లే.. థాక్రే వర్గం తన పార్టీ పేరుని, చిహ్నాన్ని కోల్పోయింది’’ అని శర్మ అన్నారు.

Taraka Ratna: ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను-తరుణ్

Show comments