Uddhav Thackeray: కాంగ్రెస్‌లో కలుపుతారనే భయం.. ఉద్ధవ్ ఎంపీల తిరుగుబాటు వెనక అసలు స్టోరీ..
- ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు.
- పక్కా స్కెచ్‌తో ఢిల్లీకి చేరిన ఎంపీలు..
- ఏక్నాథ్ షిండే వర్గంలో చేరేందుకు ఢిల్లీలో కీలక భేటీలు.
- లోక్‌సభ స్పీకర్‌కు ప్రత్యేక గ్రూప్ గుర్తింపు కోరుతూ లేఖ.
- కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై ఎంపీల ఆందోళన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మరోసారి చీలిపోయింది. శివసేన(యూబీటీ) ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ సేనకు 9 మంది ఎంపీలు ఉంటే, వీరిలో ఆరుగురు రెబల్ వర్గంగా విడిపోయారు. చడిచప్పుడు కాకుండా అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోవడం, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో రహస్య భేటీ, లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ఇవ్వడం ఇలా అన్ని ప్రణాళికాబద్ధంగా సాగాయి. శివసేన యూబీటీ ఎంపీలు తిరుగుబాటు ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.
పక్కా ప్లాన్‌తో ఢిల్లీకి..
తిరుగుబాటు చేసిన ఎంపీల్లో సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్‌ముఖ్, ఓమ్రాజే నింబాల్కర్, భాసాహెబ్ వాక్చౌరే, నాగేశ్ పాటిల్ అష్టికర్, సంజయ్ దినా పాటిల్ ఉన్నారు. వీరంతా జూన్ 14న పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. దీని తర్వాత జరిగిన ఆదిత్య ఠాక్రే పుట్టినరోజుకు కూడా వీరు దూరంగా ఉన్నారు. జూన్ 16న ఢిల్లీకి చేరుకున్న మొదటి ఎంపీగా నాగేష్ అష్టికర్ ఉన్నారు. ఆయన తెల్లవారజామును నాందేడ్ నుంచి ప్రైవేట్ జెట్‌లో దేశ రాజధానిలో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత మిగతా ఎంపీలు కూడా ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేరారు. జూన్ 16తెల్లవారుజామున శివసేన అధినేత ఏక్నాథ్ షిండే కూడా ఢిల్లీకి వెళ్లారు. జూన్ 17న ఉదయం 7 గంటలకు స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తామంతా ఏక్నాథ్ షిండే శివసేనలో విలీనం అవుతున్నామని, సభలో తమకు సీట్లను మార్చాలని లేఖ సమర్పించారు.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే భయం..
ఎంపీలు సమర్పించిన లేఖలో ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే భయాన్ని వ్యక్తం చేశారు. ఇదే కాకుండా 9 మంది ఎంపీల్లో ఆరుగురు తిరుగుబాటు చేయడంతో, ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత తప్పించుకోవడానికి అవసరమైన మూడింట రెండొతుల మెజారిటీ ఉంది. శివసేన ఆవిర్భావ దినోత్సవం జూన్ 20న తిరుగుబాటు ఎంపీలు షిండేను కలవనున్నారు. ఉద్ధవ్ వర్గాన్ని ఎందుకు వీడాల్సి వచ్చిందనే వివరాలను వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?