NTV Telugu Site icon

Delhi: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ.. మహారాష్ట్రలో పొత్తుపై చర్చ

Mallikarjunkhargeuddhavthac

Mallikarjunkhargeuddhavthac

మహారాష్ట్ర శివసేన యూబీటీ నాయకుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, కుమారుడు ఆదిత్య ఠాక్రే ఢిల్లీలో  పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు. పర్యటనలో భాగంగా బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఇండియా కూటమిలో భాగమైన శివసేన యూబీటీ.. పొత్తు, సీట్ల పంపకాలపై చర్చిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Poonam Kaur: కేరళ రాకుమారి కాళ్ళ వద్ద పూనమ్ కౌర్.. ఫొటో వైరల్

గత లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమి మెరుగైన ఫలితాలను సాధించింది. ఇదే ఊపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించాలని కూటమి భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పొత్తు, సీట్ల పంపకాలపై సోనియా, రాహుల్, మల్లిఖార్జున ఖర్గేతో చర్చించనున్నారు. అక్టోబర్‌లోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని సన్నద్ధం అవుతోంది. అలాగే ఎన్డీఏ కూటమి కూడా వ్యూహాలు రచిస్తోంది. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం మహారాష్ట్రలో ఒంటరిగా పోటీ చేయాలని ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Putin: ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక సూచన