UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్‌కు లాభం, పాకిస్తాన్‌కు నష్టం..

  • ఒపెక్ నుంచి యూఏఈ ఎగ్జిట్..
  • భారత్‌కు ప్రయోజనం, పాక్‌కు ప్రాణ సంకటం..
Uae (1)

Uae (1)

UAE OPEC Exit: పాకిస్తాన్-సౌదీ అరేబియా కూటమికి వ్యతిరేకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సౌదీ ఆధిపత్యం ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) నుండి బయటకు వచ్చింది. ఇది సౌదీతో పాటు గల్ఫ్ దేశాలకు పెద్ద దెబ్బగా అభివర్ణించవచ్చు. ఈ వ్యవహారం భారత్‌కు ప్రయోజనం, పాకిస్తాన్‌కు కష్టమైన పరిస్థితిని కల్పిస్తుంది.

భారత్‌కు లాభం .. పాక్‌కు నష్టం..

ఈ మొత్తం వ్యవహారాన్ని భారత్ దృష్టితో చూస్తే, ఈ నిర్ణయం భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. యూఏఈ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రపంచ చమురు మార్కెట్‌కు అనుకూలంగా చమురును పెంచొచ్చు. తద్వార ధరలు తగ్గే అవకాశం ఉంది. దీనికి ముందు ఒపెక్ కూటమి తమ లాభాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని తగ్గించేది, పెంచేది. అలాగే ధరల్ని కూడా నియంత్రించేంది. ఇప్పుడు యూఏఈ ఈ కూటమి నుంచి బయటకు రావడంతో తన ఇష్టానికి అనుగుణంగా ఉత్పత్తి చేయొచ్చు.

భారత్, యూఏఈకి మంచి మిత్రదేశం. ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఈ నిర్ణయం ద్వారా భారత్ విస్తారంగా యూఏఈ ఆయిల్ కొనుగోలు చేయొచ్చు. ఇదే సమయంలో భారత్ సౌదీ అరేబియా-పాకిస్తాన్ కూటమిని ఇబ్బంది పెడుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లాంటి దేశం సౌదీ నుంచి చమురు కొనుగోలు చేయకుంటే ఆ దేశానికే నష్టం. ఈ పరిణామాలు యూఏఈకి లాభం చేకూరుస్తాయి. ఇన్నాళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పాకిస్తాన్ ముస్లిం ఐడెంటిటీని చూపుతూ యూఏఈ నుంచి డబ్బులు తీసుకునేది. ఇకపై ఆ  పరిస్థితి ఉండదు. యూఏఈ పాక్‌కు డబ్బులు ఇవ్వదు.

పాక్-సౌదీలపై యూఏఈ ఆగ్రహం:

మిత్రదేశాలుగా ఉన్న యూఏఈ, సౌదీ అరేబియాల మధ్య ఇటీవల కాలంతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. యెమెన్ రాజకీయాల్లో ఇరు దేశాల మధ్య చిచ్చు రగిలింది. యెమెన్‌లో రెండు వేర్వేరు అధికార కేంద్రాలకు ఇరు దేశాల మద్దతు ఇచ్చాయి. దీంతో ఘర్షణ ప్రారంభమైంది. ఇక సూడాన్‌లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా యూఏఈ, సౌదీలు వేర్వేరు కూటముల పక్షాన నిలిచాయి.

ఇక ఇటీవల ఇరాన్ దాడుల్లో యూఏఈ తీవ్రంగా నష్టపోయింది. ఇంత దాడులు జరుగుతున్న సౌదీ కానీ, మధ్యవర్తిగా ఉన్న పాక్ కానీ స్పందించలేదు. ఇరాన్‌పై మెతక వైఖరిని అవలంభించాయి. దీంతో, నిజంగా యుద్ధం వస్తే తమకు ఏ ఇస్లామిక్ దేశం కూడా అండగా నిలవదనే సత్యం యూఏఈకి అర్థమైంది. దాడులు చేస్తున్నా అమెరికా పట్టించుకోలేదని వాదన ఉంది. దీంతో ఇకపై తన దారి తాను చూసుకోవాలని యూఏఈ భావిస్తోంది. సౌదీ-పాకిస్తాన్ సైనిక కూటమి కూడా తమకు వ్యతిరేకం అవుతుందని యూఏఈ భావిస్తోంది.