Shopping Mall: షాపింగ్ మాల్‌లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే..!

  • షాపింగ్ మాల్‌లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త
  • ప్రియురాలితో ఫైటింగ్‌కు దిగిన అర్ధాంగి
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Upfiting

Upfiting

షాపింగ్ మాల్‌ అంటే కస్టమర్లతో సందడి.. సందడిగా ఉంటుంది. కొనుగోలుదారులు తమకు నచ్చిన వస్తువులు తీసుకుని ట్రాలీలో వేసుకుంటూ ఎవరి పనిలో వారు బిజీగా ఉంటారు. అలాంటిది షాపింగ్ మాల్ ఒక్కసారిగా సినిమా షూటింగ్‌లా మారిపోయింది. ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని ఫైటింగ్‌కు దిగారు. ఈ తతంగాన్ని కస్టమర్లు తమ మొబైల్‌లో రికార్డ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Rajnikanth : రాధికాతో అర్ధరాత్రి బైక్ రైడ్.. ఎమోషన్ అయిన సూపర్ స్టార్

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లా రాబర్ట్స్‌గంజ్‌లోని సివిల్ లైన్ రోడ్‌లోని సిటీకార్ట్ షాపింగ్ మాల్ ఉంది. కస్టమర్లతో సందడిగా ఉంది. శనివారం సాయంత్రం 3 గంటలకు ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఒక వివాహితుడు.. స్నేహితురాలితో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. ఇంతలో సడన్‌గా భార్య ప్రత్యక్షమైంది. దీంతో భర్త ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.

ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. ఓపెన్‌ మ్యాన్‌హోల్‌లో పడి యువకుడి మృతి

స్నేహితురాలు అని భర్త నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే భార్య.. ఆమెతో గొడవకు దిగింది. ఒకరి నొకరు చెంపదెబ్బలు కొట్టుకుంటూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకున్నారు. విడదీయాల్సిన భర్త అదే అదునుగా షాపింగ్ మాల్ నుంచి పారిపోయాడు. మిగతా కస్టమర్లు అయినా విడదీయకుండా వినోదంగా భావించి మొబైల్‌లో చిత్రీకరించారు. ఇక షాపింగ్ మాల్ సిబ్బంది, మేనేజర్ స్పందించి ఇద్దరు మహిళలను విడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.