NTV Telugu Site icon

Jammu Kashmir: దోడాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. జూన్ 11-12 తేదీల్లో జమ్మూలోని రియాసి, దోడా, కథువా జిల్లాల ఉగ్రవాద ఘటనల తర్వాత భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. దాడులు చేసి దట్టమైన అడవుల్లో, కొండలు, గుహల్లో దాక్కుంటున్న ఉగ్రవాదుల కోసం భారీ ఆపరేషన్ చేపట్టారు.

Read Also: PM Modi: స్పీకర్ ఓం బిర్లాపై ప్రధాని మోడీ ప్రశంసలు..

బుధవారం దోడా జిల్లాలో గండోహ్ ప్రాంతంలోని బజాద్ గ్రామంలో కాల్పులు ప్రారంభమయ్యాయి. జూన్ 11న దోడా జిల్లాలోని చటర్ గల్ల వద్ద ఆర్మీ, పోలీస్ జాయింట్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత గండో ప్రాంతలోని కోట దిగువన ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక పోలీస్ గాయపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదుల వేట కొనసాగుతుండగా ఈరోజు సినూ పంచాయతీ గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించామని, దాక్కున్న ఉగ్రవాదుల నుంచి భారీ కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఈ నెల ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజునే రియాసీలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. శివ్ ఖోరీ నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై దాడి చేశారు. దీంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. ఆ తర్వాత కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి.