జట్టు.. ముఖ సౌందర్యానికి అందం. జట్టు లేకపోతే ఎన్ని ఇబ్బందులో వాళ్లకే మాత్రమే తెలుస్తోంది. బట్టతలతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. బయటకు వెళ్లాలన్నా.. నలుగురిలో కలవాలన్నా.. ఇబ్బంది ఫీలవుతుంటారు. అలాంటి వాళ్ల కోసం వైద్య రంగంలో ఎన్నో శస్త్ర చికిత్సలు వచ్చాయి. శస్త్ర చికిత్సల ద్వారా వెంట్రుకలు మొలిపిస్తున్నారు. అయితే ఏమైందో.. ఏమో తెలియదు గానీ.. అలా శస్త్ర చికిత్స చేసుకున్న ఇద్దరు ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఇందుకు కారణమైన డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Heavy Rains: హైదరాబాద్‌లో వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వినిత్ కుమార్ దూబే, ప్రమోద్ కటియార్ అనే ఇద్దరు ఇంజనీర్లు మార్చి 13న జట్టుకు సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అయితే శస్త్ర చికిత్స వికటించింది. దీంతో వారు వేరే ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స జరిగిన 48 గంటల్లోనే వినిత్ కుమార్ దూబే, ప్రమోద్ కటియార్ ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: PM Modi: నుదిట సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం
అయితే శస్త్ర చికిత్స వికటించడం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని వినిత్ కుమార్ దూబే భార్య జయ త్రిపాఠి పోలీసులుకు చెప్పింది. కానీ పట్టించుకోలేదు. తిరిగి ఆమె మే 9న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యురాలి కోసం వెతికారు. కానీ దొరకలేదు. దీంతో వైద్యురాలు అనుష్క తివారీ సోమవారం పోలీసులు ఎదుట లొంగిపోయింది.

పోలీసులు తొలుత కేసు సీరియస్‌గా తీసుకోలేదని.. అందుకే ఫిర్యాదు చేయడంలో ఆలస్యం అయిందని త్రిపాఠి తెలిపారు. ముఖ్యమంత్రి ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేశాకే.. కేసు ముందుకు సాగిందని.. దీంతో మే 9న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. మార్చి 14న ఫోన్ కాల్ వచ్చిందని.. వెళ్లి చూస్తే తన భర్త ముఖం వాచిపోయి ఉందని చెప్పింది. వైద్యురాలిని సంప్రదించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదని తెలిపింది.

ఇక వైద్యురాలు అనుష్క తివారీపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. శస్త్ర చికిత్స అనేది ఆమె రంగానికి సంబంధించినది కాదని తేలింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది దిలీప్ సింగ్ తెలిపారు. కాకదేశ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని.. ప్రాథమికంగా అనుష్క తివారీ దోషి అని తేలిందని చెప్పారు. కేసు తీవ్రతను బట్టి సోమవారం వైద్యురాలి కోర్టులో లొంగిపోయింది. అనంతరం జైలుకు తరలించారు.