Site icon NTV Telugu

బర్గర్ బయటపెట్టిన భయంకరమైన నిజం…

తమిళనాడులో బర్గర్ ఓ భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. కన్న తల్లీని చంపి… ఆమె రక్తంతో బోమ్మలకు పూస్తూ ఆడుకుంటున్నారు ఇద్దరు కూతుర్లు.తిరునల్వేలి జిల్లా పళయంకొట్టైలోని కేటిసి నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. టిచర్ అయినా తల్లి ఉషా నిన్న ఉదయం నుండి బయటకు రాకపోవడం అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్ధానికులు. బలవంతంగా ఇంటిలోకి ప్రవేశించిన పోలీసులకు షాక్ ఇచ్చాయి ఇంటిలోని దృష్యాలు. తల్లి రక్తపు మడుగులో ఉంటే పక్కన బోమ్మలతో ఆడుకుంటున్నారు ఇద్దరు కూతుర్లు. చేతిలో శ్రీకృష్టుడి బోమ్మతో ఉన్న ఇద్దరు కూతుర్లు అదుపులోకి తోసుకున్నారు పోలీసులు. అయితే ఇద్దరు కూతుళ్లకి మతిస్థిమితం లేకపోవడంతో ఆమె హత్య పోలీసులకి మిస్టరీగా మారింది. కానీ అనుమానంతో ఓ పోలీసు అధికారి ఇద్దరికి బర్గర్ తీసిఇవ్వడంతో దానిని తింటూ కర్రతో తల్లిని కోట్టి చంపినా నిజాన్ని చెప్పారు కూతుర్లు.

Exit mobile version