TVK Super Hit : తమిళ రాజకీయాల్లో పెను సంచలనం.. విజయ్ ‘టీవీకే’ సూపర్ హిట్..!
- తమిళనాడులో సూపర్ హిట్టయిన విజయ్ టీవీకే పార్టీ
- కోటి 28 లక్షల ఓట్లతో అగ్రస్థానంలో నిలిచిన టీవీకే
- రెండో స్థానానికి పరిమితమైన అధికార డీఎంకే కూటమి
- మూడో స్థానంతో సరిపెట్టుకున్న అన్నాడీఎంకే కూటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Super Hit : తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన ద్రవిడ పార్టీలకు షాక్ ఇస్తూ, దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టించింది. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం, విజయ్ పార్టీ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది.
సినీ గ్లామర్‌తో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, అనతి కాలంలోనే ప్రజల మద్దతును భారీగా కూడగట్టుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ ఏకంగా కోటి 28 లక్షల ఓట్లను సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏ పార్టీ తోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి ఇంతటి భారీ స్థాయిలో ఓట్లు సాధించడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విజయ్ చరిష్మా , ఆయన పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
Also Read
- Imran Khan: అమెరికా పౌరుడిగా ఉంటూ భారత్‌లో నిరసనలా?.. నటుడిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు!
- Omar-Nidhi Wedding: నిధిని ఇస్లాంలోకి మార్చాల్సింది.. ఒమర్ అబ్దుల్లా పెళ్లిపై మౌలానా వివాదాస్పద వ్యాఖ్యలు.!
- Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
- Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే (DMK) కూటమి ఈ సారి రెండో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. డీఎంకే కూటమి మొత్తానికి కోటి 17 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో డీఎంకే పార్టీ ఒంటరిగా 83 లక్షల ఓట్లను సాధించింది. అధికారంలో ఉండి కూడా విజయ్ పార్టీ కంటే తక్కువ ఓట్లు సాధించడం డీఎంకే శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. బలమైన క్యాడర్ , ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పటికీ, కొత్తగా వచ్చిన టీవీకే పార్టీని అడ్డుకోవడంలో డీఎంకే విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని మరో ప్రధాన పార్టీ అయిన అన్నాడీఎంకే (AIADMK) కూటమి మూడో స్థానానికి పడిపోయింది. అన్నాడీఎంకే కూటమికి కేవలం కోటి 8 లక్షల ఓట్లు మాత్రమే లభించాయి. ఇక పార్టీ పరంగా చూస్తే అన్నాడీఎంకే ఒంటరిగా 77 లక్షల ఓట్లను పొందింది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈ పార్టీ ఇప్పుడు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావడం గమనార్హం. తమిళనాడులో ఎప్పుడూ ఉండే ద్విధ్రువ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయంగా, పైగా అగ్రగామి పార్టీగా ఎదిగింది. ఈ మార్పు రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాల్లో మరిన్ని ఆసక్తికర పరిణామాలకు దారితీయనుంది.
తాజావార్తలు
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
-
Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
-
Tollywood : సీనియర్స్ స్పీడ్..కుర్ర హీరోల లేట్?
-
GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
-
Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!