TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ
- విజయ్ వర్సెస్ గవర్నర్ తీరుపై నెట్టింట ప్రత్యేక చర్చ
- న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు
- ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. విజయ్ వర్సెస్ గవర్నర్ అన్న రీతిలో ఫైటింగ్ సాగుతోంది. గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ మొండిపట్టుపై మేధావులు, ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని టీవీకేను ఎందుకు ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. విజయ్ మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవడంపై విజయ్ న్యాయ నిపుణులతో సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. తదుపరి కార్యాచరణపై మేధావులతో చర్చిస్తున్నారు. న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ లాంటి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
Also Read
- TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
- BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించిన గత పరిస్థితిని న్యాయ బృందం పరిగణనలోకి తీసుకుంటోందని వర్గాలు తెలిపాయి. ఆ విధంగానే విజయ్‌ను ఎందుకు పిలవడం లేదని.. దీని వెనుక ఏదో కుట్ర జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చట్టపరమైన, రాజకీయ మార్గాలన్నింటినీ పరిశీలిస్తున్నామని కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ప్రధాన కార్యదర్శి గిరీష్ చోడంకర్ చెప్పారు.
ఇదిలా ఉంటే గవర్నర్ తీరుపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తే తక్షణమే స్పందన రాకపోవచ్చని న్యాయ నిపుణులు చెప్పినట్లు తెలుస్తోంది. అయినా ప్రస్తుతం న్యాయస్థానాలు వేసవి సెలవుల్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కోర్టును ఆశ్రయించకపోవడమే బెటర్ అన్నట్టుగా సమాచారం. అందుకోసమే తక్షణ కర్తవ్యంగా వామపక్షాలు, వీసీకే పార్టీల మద్దతుతో ముందుకెళ్లాలని విజయ్ భావిస్తున్నారు. ఇప్పుటికే ఆ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. ఏ విషయం అన్నది రేపు చెబుతామన్నారు. అంతా సానుకూలం అయితే మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోతాయి.
అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘‘రాజ్యాంగ విజ్ఞతకు నిలయమైన గవర్నర్‌కు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమిళనాడులోని అతిపెద్ద పార్టీని పిలవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.’’ అని అన్నారు.
తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సోమవారం వెలువడిన ఫలితాల్లో టీవీకే 108, డీఎంకే 59, ఏఐడీఎంకే 47, కాంగ్రెస్ 5, సీపీఐ 2, సీపీఎం 2, సీవీకే 2, ముస్లిం లీగ్ 2 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతును విజయ్‌కు ప్రకటించింది. దీంతో విజయ్ బలం 112కు చేరింది. వామపక్షాలు, విదుతలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు మద్దతు ఇస్తే మాత్రం విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈజీ అవుతుంది. ఆ పార్టీల దగ్గర 6 సీట్లు ఉన్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 118కు చేరుతుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోతాయి. అయితే రేపు ఏం జరగబోతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!