Site icon NTV Telugu

TVK Chief Vijay: నేడు కాంచీపురం జిల్లాలో టీవీకే చీఫ్ విజయ్ పర్యటన..

Vijay

Vijay

TVK Chief Vijay: తమిళనాట తన సత్తా చూపించాలని తమిళిగ వెట్రి కజగం ( టీవీకే) పార్టీని నటుడు విజయ్ దళపతి స్థాపించారు. తన మార్కుకు అనుగుణంగానే లక్షల మందితో బహిరంగ సభలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే, సెప్టెంబర్ 27వ తేదీన కరూర్ లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాటతో తీవ్ర అప్రతిష్ట పాలయ్యారు. ఇరుకైన ప్రదేశంలో ర్యాలీ చేపట్టడంతో తొక్కిసలాట జరిగి 41 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని తీవ్రంగా కలిచి వేసింది. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ విజయ్ మరోసారి ప్రజల ముందుకు రాబోతున్నారు. ఇవాళ (నవంబర్ 23న) కాంచీపురం జిల్లాలో 2 వేల మంది పార్టీ కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేపట్టారు. ఈ సమావేశానికి భద్రతకు సంబంధించి ఇప్పటికే పార్టీకి కార్యకర్తలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు.

Read Also: Biker : శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?

ఇక, లోపలికి వెళ్లే వ‍్యక్తులకు క్యూఆర్ కోడ్ ఉన్న ప్రత్యేక పాస్ లు ఉంటేనే అనుమతి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మీటింగ్ లో టీవీకే చీఫ్ విజయ్ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. కాగా డిసెంబర్ 4వ తేదీన ర్యాలీకి అనుమతి కోసం పార్టీ ప్రయత్నించగా భద్రతా కారణాల రీత్యా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. కాగా, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే ప్రచార కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాలని చూస్తుంది. ర్యాలీలకు, భారీ సభలకు పోలీసుల అనుమతికి సమయం పడుతుండటంతో వీలైనన్ని ఇండోర్ మీటింగ్ లు పెట్టి ప్రజలకు చేరువ కావాలని తమిళిగ వెట్రి కళగం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version