TVK Chief Vijay: నేడు కాంచీపురం జిల్లాలో టీవీకే చీఫ్ విజయ్ పర్యటన..
- నేడు కాంచీపురం జిల్లాలో టీవీకే చీఫ్ విజయ్ పర్యటన..
- కాంచీపురం జిల్లా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం..
- కరూర్ ఘటన నేపథ్యంలో 2 వేల మందికే అనుమతి..
- క్యూఆర్ కోడ్ ఉన్న వారికి మాత్రమే ప్రవేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK Chief Vijay: తమిళనాట తన సత్తా చూపించాలని తమిళిగ వెట్రి కజగం ( టీవీకే) పార్టీని నటుడు విజయ్ దళపతి స్థాపించారు. తన మార్కుకు అనుగుణంగానే లక్షల మందితో బహిరంగ సభలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే, సెప్టెంబర్ 27వ తేదీన కరూర్ లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాటతో తీవ్ర అప్రతిష్ట పాలయ్యారు. ఇరుకైన ప్రదేశంలో ర్యాలీ చేపట్టడంతో తొక్కిసలాట జరిగి 41 మంది సామాన్య ప్రజలు చనిపోయారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని తీవ్రంగా కలిచి వేసింది. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ విజయ్ మరోసారి ప్రజల ముందుకు రాబోతున్నారు. ఇవాళ (నవంబర్ 23న) కాంచీపురం జిల్లాలో 2 వేల మంది పార్టీ కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించనున్నారు. దీనికి పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేపట్టారు. ఈ సమావేశానికి భద్రతకు సంబంధించి ఇప్పటికే పార్టీకి కార్యకర్తలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు.
Read Also: Biker : శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ వాయిదా.. కారణం ఏంటంటే?
Also Read
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్‌ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్‌లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
ఇక, లోపలికి వెళ్లే వ్యక్తులకు క్యూఆర్ కోడ్ ఉన్న ప్రత్యేక పాస్ లు ఉంటేనే అనుమతి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మీటింగ్ లో టీవీకే చీఫ్ విజయ్ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. కాగా డిసెంబర్ 4వ తేదీన ర్యాలీకి అనుమతి కోసం పార్టీ ప్రయత్నించగా భద్రతా కారణాల రీత్యా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. కాగా, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే ప్రచార కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాలని చూస్తుంది. ర్యాలీలకు, భారీ సభలకు పోలీసుల అనుమతికి సమయం పడుతుండటంతో వీలైనన్ని ఇండోర్ మీటింగ్ లు పెట్టి ప్రజలకు చేరువ కావాలని తమిళిగ వెట్రి కళగం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్‌లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!