Site icon NTV Telugu

MRK Panneerselvam: టీవీకే చీఫ్ విజయ్ బ్లాక్లో టికెట్లు అమ్మాడు.. అవినీతిపై మాట్లాడే హక్కు లేదు..

Vijay

Vijay

MRK Panneerselvam: తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ పై డీఎంకే మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం విమర్శలు గుప్పించారు. గతంలో విజయ్ బ్లాక్ టిక్కెట్లు అమ్మిన వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి ప్రసంగాలు ఇస్తున్నాడు అని మండిపడ్డారు. అతను తన తల్లిదండ్రులతో కూడా జీవించలేని స్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడటం గురించి మాట్లాడుతున్నాడని పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక, ‘టీవీకే’ అంటే ఏమిటి అని డీఎంకే కార్యకర్తలను అడిగ్గా.. ‘త్రిష’, ‘కీర్తి సురేష్’ అని పార్టీ శ్రేణుల నుంచి వాయిస్ వినిపించడంతో.. మీకు అన్ని విషయాలు తెలుసంటూ మంత్రి వ్యంగ్యంగా అన్నారు. అయితే, రాష్ట్రాన్ని నడపడం అంటే సినిమాలో నటించడం లాంటిదని వారు ( టీవీకే చీఫ్ విజయ్) భావిస్తున్నారని మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌ సెల్వం పేర్కొన్నారు.

Read Also: CM Chandrababu: ఇక అమరావతి అభివృద్ధి అన్‏స్టాపబుల్..

అయితే, మార్చి 28వ తేదీన జరిగిన పార్టీ మొదటి జనరల్ బాడీ సమావేశంలో టీవీకే అధినేత విజయ్ మాట్లాడుతూ.. డీఎంకేను తీవ్రంగా విమర్శించాడు.. 2026 అసెంబ్లీ ఎన్నికలు టీవీకే- డీఎంకే మధ్య ప్రత్యక్ష యుద్ధం స్టార్ట్ అవుతుందన్నారు. దీంతో పాటు గౌరవనీయులైన ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్, మీ పేరులో ధైర్యం ఉంటే సరిపోదు.. దానిని మీ పనిలో కూడా చూపించాలి అంటూ సెటైర్లు వేశారు. ఇక, స్టాలిన్ సర్కార్ ను “ఫాసిస్ట్ ప్రభుత్వం కంటే తక్కువ కాదు” అని ఆరోపించారు.

Exit mobile version