Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Tvk Chief Vijay Praises Prabhakaran Rajiv Gandhi Killer

Vijay: రాజీవ్ గాంధీ హంతకుడిపై యాక్టర్ విజయ్ ప్రశంసలు.. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ గురించి ఏమన్నారంటే.

Published Date :September 20, 2025 , 5:50 pm
By Venu Goapl Reddy
  • ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌పై నటుడు విజయ్ ప్రశంసలు..
  • శ్రీలంక తమిళ సమాజానికి తల్లి లాంటి వారంటూ కితాబు..
  • తమిళనాట సంచలనంగా మారిన టీవీకే చీఫ్ వ్యాఖ్యలు..
Vijay: రాజీవ్ గాంధీ హంతకుడిపై యాక్టర్ విజయ్ ప్రశంసలు.. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ గురించి ఏమన్నారంటే.
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijay: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో ఉన్న తమిళ సమస్యల్ని లెవనెత్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) దివంగత చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన, ప్రభాకరన్‌పై ప్రశంసించడం సంచలనంగా మారింది. దేశ ప్రజలు శ్రీలంక తమిళుల గొంతుక కావాలని పిలుపునిచ్చారు.

Read Also: India vs Pakistan: ఎందుకంత భయం..? భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కొత్త వ్యూహం..

తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా, నాగపట్నంలో జరిగిన కార్యక్రమంలో విజయ్ శ్రీలంక తమిళులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభాకరన్ సమాజానికి ‘‘తల్లి లాంటి వారు’’ అని అన్నారు. శ్రీలంక తమిళుల సమస్య తమిళనాడులో, ముఖ్యంగా నాగపట్నం ప్రాంతంలో భావోద్వేగాలతో కూడి ఉంటుంది. ‘‘తమిళ ప్రజలకు శ్రీలంక తమిళులు సోదరులు అని, ఈలం తమిళులు వారు శ్రీలంకలో ఉన్నా లేదా ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నా, తమపై మాతృ ప్రేమను చూపించిన నాయకుడిని కోల్పోయిన తర్వాత బాధపడుతున్నారు’’ అని ప్రభాకరన్ గురించి విజయ్ అన్నారు. వారి కోసం మాట్లాడటం మన కర్తవ్యం అని చెప్పారు. విజయ్ శ్రీలంక తమిళుల కోసం మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. 2008లో శ్రీలంక తమిళుల హత్యకు నిరసనగా చెన్నైలో నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

రెండు దశాబ్ధాల పాటు శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో ఎల్టీటీఈ సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. 1990లో భారత్ ఎల్టీటీఈని నిషేధించింది. శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఈ సంస్థ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. 2009లో శ్రీలంక సైన్యానికి, ఎల్టీటీఈకి జరిగిన భీకర పోరాటంలో ప్రభాకరన్ మరణించాడు. అప్పటి నుంచి శ్రీలంకలో ఈ వేర్పాటువాద ఉద్యమం అంతమైంది. ఎల్టీటీఈతో పోరాడేందుకు రాజీవ్ గాంధీ భారత సైన్యాన్ని పంపారనే కోపంతో 1991లో ప్రభాకరన్, ఎల్టీటీఈ నిఘా చీఫ్ పొట్టు అమ్మన్ రాజీవ్ గాంధీ హత్యకు పథకం వేశారు. 1991లో చెన్నై సమీపంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో శ్రీలంక తమిళ మహిళా ఆత్మాహుతి బాంబర్ శ్రీ గాంధీని పేల్చివేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actor Vijay
  • Eelam Tamils issue
  • LTTE
  • LTTE Prabhakaran
  • Nagapattinam rally

తాజావార్తలు

  • Ramayan: ‘రామాయణ్’ రన్‌టైమ్ లీక్ చేసిన రణ్‌బీర్..

  • Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!

  • Rahul Gandhi: మోడీ ఇప్పుడు ట్రంప్ నియంత్రణలో ఉన్నారు.. కేరళ ప్రచారంలో రాహుల్ గాంధీ విసుర్లు

  • Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • CM Chandrababu: అమరావతి నిర్మాణంలో రాజీ పడొద్దు.. నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశాలు!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions