Tuition Teacher: 9 ఏళ్ల బాలికను చెంపపై కొట్టిన టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్తో ప్రాణాపాయ స్థితి..
- 9 ఏళ్ల బాలిక చెంపపై కొట్టిన ట్యూషన్ టీచర్..
- టెటానస్ ఇన్ఫెక్షన్తో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tuition Teacher: 9 ఏళ్ల బాలిక అల్లరి చేస్తుందని ట్యూషన్ టీచర్ కొట్టడం, బాలిక ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. మహారాష్ట్రలో ముంబైకి 58 కి.మీ దూరంలోని నల్లసోపరాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక చెవి కింద టీచర్ రెండుసార్లు గట్టిగా చెంపదెబ్బ కొట్టడంతో బాలిక మెదడుకు తీవ్రగాయమైంది. ఈ సంఘటన అక్టోబర్ 05న జరిగింది. అప్పటి నుంచి విద్యార్థిని దీపిక ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. టీచర్ కొట్టిన వారం తర్వాత దీపిక ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. ఒక వారం తర్వాత ఆస్పత్రిలో చేర్చబడింది.
Also Read
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల ప్రైవేట్ ట్యూషన్ టీచర్ రత్న సింగ్, క్లాసులో అల్లరి చేస్తుందని బాలిక చెంపపై కొట్టాడు. చెంపపై దాడి చేయడంతో బాలిక చెవిపోగులు చెంపకు గుచ్చుకున్నాయని పోలీసులు తెలిపారు. తొమ్మిదేళ్ల చిన్నారి మెదడుకు తీవ్రగాయం కావడం, దవడలు-మెడలు బిగుసుకుపోవడం, ధనుర్వాతం(టెటానస్) ఇన్ఫెక్షన్తో బాలిక ముంబైలోని సోమయ్యం ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చేరింది. గత 9 రోజులుగా బాలిక వెంటిలెటర్‌పై ఉంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. టీచర్‌కి నోటిసులిచ్చాం, విచారణ జరిపి, వైద్యులు అభిప్రాయం తీసుకుని చార్జిషీట్ దాఖలు చేస్తామని పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..