Mohan Bhagwat: నిజమైన ‘‘సేవక్’’ అహంకారిగా ఉండరు.. ఎన్నికల తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు..
- ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- మణిపూర్ సమస్య ప్రస్తావన..
- నిజమైన ‘సేవక్’ అహంకారిగా ఉండరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Bhagwat: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన స్వయం సేవక్ అహంకారాన్ని ప్రదర్శించకుండా, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మర్యాదగా కొనసాగడం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు. బీజేపీ జాతీయవాదంపై దూకుడుగా ప్రచారం చేసినప్పటికీ, 10 ఏళ్లలో మొదటిసారిగా మెజారిటీ మార్క్ 272కి తక్కువగా సీట్లు పడిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మోడీ 3.0 ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టీడీపీ, జేడీయూ నితీష్ కుమార్‌లపై ఆధాపడింది. బీజేపీకి సొంతగా 240 సీట్లు ఉన్నాయి.
Read Also: Vishnupriya Hot Pics: ఏమా అందాలు.. వర్షాకాలంలో వేడి పుట్టిస్తున్న విష్ణు ప్రియ!
Also Read
- Dharmendra Pradhan: విద్యార్థి రాజకీయాల నుంచి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా వరకు..
- Devendra Fadnacis: కేంద్రమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్..? ఢిల్లీ నుంచి పిలుపు..
- Gen Z: 'జెన్ జీ... మమ్మల్ని క్షమించు..'! నేటి యువ తరాన్ని సమాజం తప్పుగా అర్థంచేసుకుందా?
- Sonam Wangchuk: ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం’’.. కేంద్రమంత్రి రాజీనామాపై సోనమ్ వాంగ్‌చుక్..
నాగ్‌పూర్‌లో జరిగిన సంఘ్ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడారు. రాజకీయ పార్టీలు, నేతలు ఒకరినొకరు దూషించుకునే క్రమంలో వర్గాల మధ్య చీలికలకు కారణమవుతున్నామనే విషయాన్ని పరిగణలోకి తసీుకోలేదని అన్నారు. ఆర్ఎస్ఎస్‌ని కూడా ఇందులోకి లాగుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇతరులను దుర్వినియోగం చేయడం, టెక్నాలజీని దుర్వినియోగం చేయడం, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదన్నారు. మణిపూర్ వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరాన్ని ఆయన ప్రాధాన్యతగా నొక్కిచెప్పారు.
మణిపూర్ శాంతి కోసం ఎదురుచూసి ఏడాది అయింది. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రం శాంతియుతంగా ఉంది, కానీ అకస్మాత్తుగా, మళ్ళీ తుపాకీ సంస్కృతి పెరిగింది. వివాదాన్ని ప్రాధాన్యతగా పరిష్కరించడం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. మణిపూర్ పరిస్థితిని ప్రాధాన్యతతో పరిష్కరించాలి, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టాలని కోరారు. మణిపూర్ గత ఏడాది మే 3న ఇంఫాల్ లోయకు చెందిన మెయిటీస్ మరియు కొండ ఆధారిత కుకీల మధ్య వివాదం చెలరేగిన తర్వాత జాతి హింసకి కారణమైంది.ఫలితంగా 200 మందికి పైగా మరణించారు మరియు వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: విద్యార్థి రాజకీయాల నుంచి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా వరకు..
-
Ind Vs Zim 2nd T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..
-
Devendra Fadnacis: కేంద్రమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్..? ఢిల్లీ నుంచి పిలుపు..
-
Gen Z: ‘జెన్ జీ… మమ్మల్ని క్షమించు..’! నేటి యువ తరాన్ని సమాజం తప్పుగా అర్థంచేసుకుందా?
-
Prakash Raj: “కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!” : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!