Trisha vs Nayinar Nagendran: త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత నాగేంద్రన్
- త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు
- విజయ్‌పై విమర్శలే వివాదానికి కారణం
- చట్టపరమైన చర్యల హెచ్చరిక
- చివరకు క్షమాపణలు తెలిపిన నాగేంద్రన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trisha vs Nayinar Nagendran: రాజకీయ విమర్శల్లో వ్యక్తిగత దూషణలు ఏ స్థాయికి చేరుతాయో చెప్పడానికి ఇటీవల తమిళనాడులో చోటుచేసుకున్న పరిణామాలే నిదర్శనం. నటి త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు బీజేపీ నేత నాయనార్ నాగేంద్రన్ చివరకు తలవొంచి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు.
ఈ వివాదం టీవీకే (TVK) పార్టీ అధినేత, నటుడు విజయ్‌పై నాగేంద్రన్ చేసిన విమర్శల్లో ఉన్నాయి. విజయ్‌కు రాజకీయ అనుభవం లేదని విమర్శించే క్రమంలో నాగేంద్రన్ శృతి మించి మాట్లాడారు. విజయ్ తన ఇంటిని వదిలి బయటకు రావాలని, ముఖ్యంగా నటి త్రిషతో ఉన్న రిలేషన్ నుంచి బయటపడితేనే ఆయనకు గ్రౌండ్ లెవల్ సమస్యలు అర్థమవుతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే ముందు తన వ్యక్తిగత బంధాలను సరిదిద్దుకోవాలంటూ ఆయన చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి.
Also Read
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
India vs Pakistan: భారత్ చేతిలో పాక్ చిత్తు.. పాకిస్థాన్ అభిమానుల మీమ్స్ మామూలుగా లేవు..
రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తనను ఈ వివాదాల్లోకి లాగడంపై నటి త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగేంద్రన్ వ్యాఖ్యలు అత్యంత అసహ్యంగా ఉన్నాయని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె మండిపడ్డారు. రాజకీయాల కోసం ఒక మహిళ గౌరవాన్ని కించపరచడం సరికాదని, ఇలాంటి ఆరోపణలు మళ్ళీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని త్రిష ఘాటుగా హెచ్చరించారు. ఈ హెచ్చరికతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆమెకు భారీ మద్దతు లభించింది.
కేవలం సినీ వర్గాలే కాకుండా రాజకీయ పక్షాలు కూడా నాగేంద్రన్ తీరును ఖండించాయి. డీఎంకే నేత, ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలో విమర్శించడం అనాగరికమని పేర్కొన్నారు. అసలు రాజకీయాలకు సంబంధం లేని మహిళల గురించి ఇలా మాట్లాడటం బీజేపీ సంస్కృతికి నిదర్శనమని ఆమె ఎద్దేవా చేశారు. చుట్టుముట్టిన విమర్శలు, త్రిష హెచ్చరికలతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన నాయనార్ నాగేంద్రన్, చివరకు విచారం వ్యక్తం చేస్తూ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.
Jangaon : జనగామలో ఆందోళన..మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
తాజావార్తలు
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?