Amit Shah: అంబేద్కర్‌పై వ్యాఖ్యలు.. అమిత్‌షాపై తృణమూల్ ప్రివిలేజ్ నోటీసులు.. .
- అమిత్ షా ‘‘అంబేద్కర్’’ వ్యాఖ్యలపై కలకలం..
- ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన టీఎంసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: రాజ్యసభలో అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు పంపింది. రాజ్యాంగ నిర్మాత వారసత్వాన్ని, పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొంది. రాజ్యసభలో టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ రూల్ 187 కింది నోటీసులు అందించారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి అమిత్ షా చేసిన ప్రసంగం నుంచి ఈ వివాదం మొదలైంది.
రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘బీఆర్ అంబేద్కర్ పేరుని చెప్పడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయింది. అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ గా మారిపోయిందని, ఇన్ని సార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేది.’’ అని ఆయన అన్నారు. నెహ్రూ ప్రభుత్వంతో విభేదించి అంబేద్కర్ రాజీనామా చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: Matrimonial fraud: విగ్గురాజా మామూలోడు కాదు.. 50 మందిని మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు
ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారాన్ని రేపాయి. అమిత్ షా దళితులను అవమానించారని కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు ఆరోపించాయి. అంబేద్కర్‌కి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే, అమిత్ షా ప్రసంగంలోని చిన్న క్లిప్‌ని మాత్రమే కాంగ్రెస్ వైరల్ చేసిందని బీజేపీ ఆరోపించింది. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది.
మరోవైపు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ‘‘ముసుగు తొలిగిపోయింది’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘అమిత్ షా డా. బాబాసాహెబ్ అంబేద్కర్‌ని అవమానించాలని అనుకున్నారు. ఇది బీజేపీ కులతత్వ, దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం. 240 సీట్లు గెలిచిన తర్వాత ఇలా వ్యవహరిస్తే, ఒక వేళ 400 సీట్లు గెలిస్తే ఎలా ఉండేదో ఆలోచించుకోంది. వారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా తుడిచివేసేవారు’’ అని ఆమె ఎక్స్‌లో ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!