తమ నేతపై ఎవరైనా ఆరోపణలు చేసినా.. విమర్శలు చేసినా.. వారి ఫాలోవర్స్‌కి ఎంతో కోపం వస్తుంది.. కొన్నిసార్లు అది కట్టలు తెచ్చుకునేవరకు వెళ్తుంది.. అలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది.. అసలే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండుతుంది.. ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడుల వరకు వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. ఏకంగా పార్టీ కార్యాలయాల్లో బాంబుల దాడికి పాల్పడిన ఘటనలు కూడా వెలుగుచూశాయి.. తాజాగా, చిసురాలో అలాంటి ఘటనే జరిగింది. ర్యాలీగా వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై దాడికి దిగారు టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందార్… పార్టీ కార్యకర్తలతో కలిసి జెండా కర్రలతో బీజేపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
Read Also: Google Gift to India: ‘భారతమాత’కు గూగుల్ తల్లి జేజేలు. ‘ఇండియా కీ ఉదాన్’ ప్రారంభం
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసిత్ మజుందార్ మరియు అతని మద్దతుదారులు.. బీజేపీ కార్యకర్తలను కొట్టినట్టు మొదట ఆరోపణలు వచ్చాయి.. ఆ ఆరోపణలను కొట్టిపారేసిన టీఎంసీ, బీజేపీ మద్దతుదారులచే శాసనసభ్యుడిని ఇబ్బంది పెట్టారని ఆరోపించింది.. చిన్సురాలోని ఖాదినాన్ మోర్ వద్ద బీజేపీ ర్యాలీ సందర్భంగా ఈ ఘటన జరిగింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మజుందార్‌పై బీజేపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారని, అనవసరమైన ఆరోపణలు చేశారని.. దీంతో, వారిని తాను ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు.. వారు నా కారును ఆపి నన్ను కొట్టారు, ఆ తర్వాత మా మహిళా కార్మికులు జోక్యం చేసుకున్నారు” అని మజుందార్ తెలిపారు.. కానీ, ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నాం.. కానీ, ఎమ్మెల్యే, ఆయన మద్దతుదారులే తమపై దాడి చేశారని, కొట్టారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ‘వీధిలో ఉన్న ప్రతిపక్ష కార్యకర్తలపై కర్రతో దాడి చేస్తే’ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి సమీక్ భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం.. ఆమెపై ఆరోపణలు చేయడంతోనే ఇలాంటి ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.
